Anasuya Bharadwaj: కాంతార సినిమా పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. రిషబ్ శెట్టి గురించి ఏమన్నారంటే..

ముఖ్యంగా ఇందులో రిషబ్ శెట్టి నటనకు మంచి మార్కులే పడ్డాయి. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో 20 నిమిషాలు రిషబ్ శెట్టి తన నటనతోనే సినిమాను వేరే లెవల్ కు తీసుకెళ్లాడు. రిషబ్ టేకింగ్.. పర్ఫామెన్స్ పై సినీ విమర్శకులు ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాపై యాంకర్ అనసూయ స్పందించింది.

Anasuya Bharadwaj: కాంతార సినిమా పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. రిషబ్ శెట్టి గురించి ఏమన్నారంటే..
Anasuya
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 06, 2022 | 11:20 AM

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వియ దర్శకత్వంలో వచ్చిన కాంతార బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసింది. కర్ణాటక, కేరళ ఆదివాసీల సంప్రదాయం పై తెరకెక్కిన ఈ మూవీ దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. పాన్ ఇండియా లెవల్లో సంచలనం క్రియేట్ చేసిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కేవలం రూ. 15 కోట్లతో నిర్మించిన కాంతార ఏకంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా ఇందులో రిషబ్ శెట్టి నటనకు మంచి మార్కులే పడ్డాయి. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో 20 నిమిషాలు రిషబ్ శెట్టి తన నటనతోనే సినిమాను వేరే లెవల్ కు తీసుకెళ్లాడు. రిషబ్ టేకింగ్.. పర్ఫామెన్స్ పై సినీ విమర్శకులు ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాపై యాంకర్ అనసూయ స్పందించింది. ఇందులో రిషబ్ శెట్టిన నటనపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

తాజాగా తన ఇన్ స్టాలో ఫాలోవర్లతో ముచ్చటించింది యాంకర్ అనసూయ. అందులో అభిమానులకు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఇక కాంతార సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో రిషబ్ శెట్టి నమ్మశక్యంకానీ రీతిలో యాక్ట్ చేశాడని.. ఆ సినిమా ప్రభావం నుంచి నేను వేగంగా బయటకు రాలేకపోయాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనసూయ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న రంగమార్తండ చిత్రంలో నటిస్తోంది. అంతేకాకుండా.. పలు తెలుగు, తమిళ్ చిత్రాల్లో నటిస్తోంది. ఇక చేతినిండా సినిమాల కారణంగా ఇటీవల జబర్దస్త్ షో నుంచి అనసూయ తప్పుకున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి
Kantara

Kantara

ఇదిలా ఉంటే.. కాంతార సినీ ప్రియులకు కేరళ కోర్టు శుభవార్త అందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచిన వరాహరూపం సాంగ్ ఓటీటీలో.. సోషల్ మీడియాలో ప్లే చేయవచ్చని తీర్పునిచ్చింది. దీంతో త్వరలోనే కాంతారలో వరాహ రూపం ఒరిజినల్ అప్లోడ్ చేయనున్నారు మేకర్స్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.