Ananya Nagalla: “అందుకే గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తున్నా”.. షాకింగ్ కామెంట్స్ చేసిన అనన్య
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో ఓ పాత్రచేసింది అనన్య. ఈ పాత్రతో ఈ చిన్నదానికి మంచి గుర్తింపు వచ్చింది. వకీల్ సాబ్ సినిమాతర్వాత అనన్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. వకీల్ సాబ్ సినిమా తర్వాత అనన్య పెద్దగా సినిమాల్లో కనిపించేలేదు.

చాలా మంది కొంతమంది హీరోయిన్స్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీస్ లో అనన్య నాగళ్ళ ఒకరు. మల్లేశం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అనన్య తన నటనతో ఆకట్టుకుంది. పల్లెటూరి యువతిగా చక్కగా నటించింది. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో ఓ పాత్రచేసింది అనన్య. ఈ పాత్రతో ఈ చిన్నదానికి మంచి గుర్తింపు వచ్చింది. వకీల్ సాబ్ సినిమాతర్వాత అనన్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. వకీల్ సాబ్ సినిమా తర్వాత అనన్య పెద్దగా సినిమాల్లో కనిపించేలేదు.
కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. మొదట్లో పద్దతిగా ఉన్న ఫొటోస్ షేర్ చేసి ఆకట్టుకున్న అనన్య.. ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచేసి నెట్టింట రచ్చ చేస్తోంది.అందాలు ఆరబోస్తూ ఓ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంటుంది. ఈ బ్యూటీ హాట్ ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
అయితే ఈ చిన్నది గ్లామర్ డోస్ పెంచి ఎందుకు ఫోటో షూట్స్ చేస్తోంది అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద సినిమాల్లో ఛాన్స్ లకోసం దర్శక నిర్మాతలను ఆకర్షించడానికి ఇలా ఫోటో షూట్స్ చేస్తుంది అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా తన ఫొటో షూట్స్ స్పై స్పందించింది. అనన్య ప్రస్తుతం అన్వేషి అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. శాకుంతలం సినిమా టైం లో ఓ గ్లామర్ ఫోటోను షేర్ చేశా.. దానికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమా సినిమా రేస్ లో ఉండాలంటే అన్ని రకాలుగా కనిపించాలి అందుకే గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తున్నా.. అని తెలిపింది అనన్య.
అనన్య నాగళ్ళ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
అనన్య నాగళ్ళ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.