Balakrishna’s Akhanda: బాలయ్య అఖండ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా సరైనోడు..
నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం అఖండ. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Akhanda: నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం అఖండ. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య బోయపాటి కాంబోలో సినిమా అంటే మాములుగా ఉండదు. ఇప్పటికే సింహ , లెజెండ్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు హ్యాట్రిక్ గా రాబోతున్న అఖండ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఏ ఈసినిమా టీజర్స్, పాటలు, ట్రైలర్ సినిమా పై అంచనాలకు ఆకాశానికి చేర్చాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నాడు. `అఖండ` డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇటీవలే ఈమూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించింది. ఈ చిత్రంలోని గ్రాండ్ విజువల్స్, డ్రామాను చూసి సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్‌ను ప్రశంసించారు. మాస్ పాత్రలు చేయడం బాలకృష్ణకు కొత్తేమీ కాదు. కానీ ఈ సారి మాత్రం తనలోని విశ్వరూపాన్ని చూపించారు. అఘోరగా బాలకృష్ణ మాస్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వనున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. అఖండ ప్రీరిలీజ్ ఈవెంట్ నవంబర్ 27న హైదరాబాద్ లో శిల్పకళ వేదికలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా హాజరు కానున్నారు. బోయపాటి తెరకేకించిన సరైనోడు సినిమాలో బన్నీ నటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బాలయ్య సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ రానున్నారని తెలియడంతో ఇటు నందమూరి అభిమానులు అటు మెగా అభిమానులు ఖుష్ అవుతున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :