Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యామిలీ అందమైన ఫోటో.. ‘చిల్డ్రన్స్ డే’ స్పెషల్ బన్నీ షేర్ చేసిన బ్యూటీఫుల్ పిక్..

గతంలో వచ్చిన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సెషన్ క్రియేట్ చేసిందో చెప్పక్కర్లేదు. దీంతో ఈ మూవీ సెకండ్ పార్ట్ పుష్ప 2 పై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. అటు పుష్ప 2 షూటింగ్, ఇటు వరుస ప్రమోషనల్ యాడ్స్‏తో బిజీగా ఉన్న బన్నీ.. కాస్త సమయం దొరికితే ఫ్యామిలీతో గడిపేందుకు ఇష్టపడతాన్న సంగతి తెలిసిందే. తన కూతురు అర్హ, కుమారుడు అయాన్‏తో కలిసి ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. బన్నీ తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంటాయి.

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యామిలీ అందమైన ఫోటో.. 'చిల్డ్రన్స్ డే' స్పెషల్ బన్నీ షేర్ చేసిన బ్యూటీఫుల్ పిక్..
Allu Arjun Family
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 14, 2023 | 4:04 PM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటిస్తోన్న ఈ సినిమా కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో రష్మిక మందన్నా, ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలలో నటిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. గతంలో వచ్చిన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సెషన్ క్రియేట్ చేసిందో చెప్పక్కర్లేదు. దీంతో ఈ మూవీ సెకండ్ పార్ట్ పుష్ప 2 పై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. అటు పుష్ప 2 షూటింగ్, ఇటు వరుస ప్రమోషనల్ యాడ్స్‏తో బిజీగా ఉన్న బన్నీ.. కాస్త సమయం దొరికితే ఫ్యామిలీతో గడిపేందుకు ఇష్టపడతాన్న సంగతి తెలిసిందే. తన కూతురు అర్హ, కుమారుడు అయాన్‏తో కలిసి ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. బన్నీ తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంటాయి.

ఇటీవల దీపావళీ సందర్భంగా తన గారాలపట్టి అర్హతో టపాసులు, క్రాకర్స్ కాలుస్తూ చిన్నపిల్లాడిగా మారిపోయాడు బన్నీ. ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బన్నీ తన ఫ్యామిలీ ఫోటోను ఇన్ స్టా స్టోరీలో పంచుకున్నాడు. ఈరోజు (నవంబర్ 14న) చిల్డ్రన్స్ డే కావడంతో ఫాలోవర్లకు విషెస్ తెలియజేస్తూ తన భార్య స్నేహారెడ్డి, కూతురు అర్హ, కుమారుడు అయాన్ తో కలిసి ఉన్న ఫోటోను నెట్టింట షేర్ చేశాడు బన్నీ. ఆ ఫోటోలో బన్నీ ఫ్యామిలీ మొత్తం వెస్టర్న్ డ్రెస్‏లతో స్టైలీష్ గా కనిపిస్తున్నారు. ఇటీవల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి వేడుకలలో భాగంగా కాక్ టైల్ పార్టీలో దిగిన ఫోటో అని తెలుస్తోంది. ప్రస్తుతం బన్నీ షేర్ చేసిన బ్యూటీఫుల్ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ఇప్పటికే బన్నీ కూతురు అర్హ బాలనటిగా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన శాకుంతలం సినిమాలో అర్హ చిన్ననాటి భరతుడి పాత్రలో కనిపించింది. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన అందుకుంది. కానీ మొదటి సినిమాతోనే బాలనటిగా తన నటనకు ప్రశంసలు అందుకుంది అర్హ. కానీ ఇప్పటికే సోషల్ మీడియాలో అర్హకు ఫాలోయింగ్ ఎక్కువే ఉంది. ఇంట్లో బన్నీతో కలిసి అర్హ చేసే అల్లరికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట తెగ కనిపిస్తుంటారు. అర్హ, అయాన్ తమ తండ్రితో కలిసి సరదాగా గడుపుతున్న క్షణాలను బన్నీ సతీమణి స్నేహ రెడ్డి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.