Allu Arjun: అనుకున్న లక్ష్యాన్ని సాధించిన అల్లు అర్జున్.. విశేష గౌరవాన్ని అందుకున్న బన్నీ..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Dec 15, 2022 | 5:52 PM

తగ్గేదే లే అంటూ నెట్టింట రచ్చ చేశారు. ఈ మూవీలో ప్రపంచవ్యాప్తంగా బన్నీ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఓ విశేష గౌరవాన్ని అందుకున్నారు.

Allu Arjun: అనుకున్న లక్ష్యాన్ని సాధించిన అల్లు అర్జున్.. విశేష గౌరవాన్ని అందుకున్న బన్నీ..
Allu Arjun

పుష్ప సినిమాతో ఇప్పటివరకు తన కెరీర్‏లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. డైరెక్టర్ సుకుమార్.. బన్నీ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన రెస్పా్న్స్ వచ్చింది. ఊర మాస్ లుక్‏లో స్మగ్లర్ పుష్పరాజ్ గా బన్నీ నటనకు ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్తాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ. అంతేకాకుండా ఈ మూవీలోని మ్యూజిక్ సినీ ప్రియులను ఊర్రూతలుగించింది. సౌత్ టూ నార్త్ కాదు.. విదేశీయులు.. క్రికెటర్లు సైతం పుష్పచిత్రంలోని పాటలకు కాలు కదిపారు. పుష్పరాజ్ మేనరిజమ్ కు సామాన్యులతోపాటు… సెలబ్రెటీలు ఫిదా అయ్యారు. తగ్గేదే లే అంటూ నెట్టింట రచ్చ చేశారు. ఈ మూవీలో ప్రపంచవ్యాప్తంగా బన్నీ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఓ విశేష గౌరవాన్ని అందుకున్నారు.

వినోద రంగంలో ప్రముఖంగా భావించే జీక్యూ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఈ ఏడాదికి గానూ బన్నీని వరించింది. బుధవారం హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్లో ఈ మ్యాగజైన్ అందించే అవార్డ్ తీసుకున్నారు బన్నీ. ఇందుకు సంబంధించిన ఫోటోలను బన్నీ తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. తన లక్ష్యాన్ని అందుకున్నట్లు చెప్పారు. “లీడింగ్ మ్యాన్ ఆఫ్ 2022గా నన్ను సత్కరించినందుకు జీక్యూ ఇండియాకు ధన్యవాదాలు. జీక్యూ మ్యాగజైన్ కవర్ పై నా ఫోటో ఉండటాన్ని గౌరవంగా భావిస్తున్నాను. నా జాబితాలోని ఓ టార్గెట్ ఇలా అందుకున్నాను”. అంటూ పేర్కొన్నారు బన్నీ.

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలలో నటిస్తున్నారు . ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu