Allu Arjun: మలయాళ స్టార్ హీరోలతో పోల్చుకున్న బన్నీ.. అల్లు అర్జున్ ఫన్నీ వీడియో వైరల్..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Sep 07, 2021 | 12:01 PM

అల్లు అర్జున్..సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‏గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు

Allu Arjun: మలయాళ స్టార్ హీరోలతో పోల్చుకున్న బన్నీ.. అల్లు అర్జున్ ఫన్నీ వీడియో వైరల్..
Allu Arjun

అల్లు అర్జున్..సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‏గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాల నుంచి సినిమా అప్డేట్స్ వరకు నెట్టింట్లో షేర్ చేస్తుంటాడు. ఇక దక్షిణాదిలో అత్యంత క్రేజ్ ఉన్న హీరోలలో అల్లు అర్జున్‏ ఒకరు. అయితే అల్లు అర్జున్‏కు మలయాళంలో కూడా ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఆర్య సినిమా నుంచి ప్రతి చిత్రాన్ని మలయాళంలో కూడా విడుదల చేస్తుంటారు. అక్కడున్న స్టార్ హీరోలతోపాటు బన్నీకి కూడా అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. మన దగ్గర బన్నీ సినిమాలు ఎంతగా హిట్ అవుతాయో.. అక్కడ కూడా అల్లు అర్జున్ సినిమాలు సూపర్ హిట్ అవుతుంటాయి. అక్కడి అభిమానులు అల్లు అర్జున్ ను ముద్దుగా మల్లు అర్జున్ అని పిలుస్తుంటారు.

అయితే నిత్యం నెట్టింట్లో యాక్టివ్‏గా ఉండే అల్లు అర్జున్.. సోమవారం ఓ ఫన్నీ టాస్క్ చేసారు. ఇన్‏స్టా స్టోరీలలో ఉండే ఫిల్టర్ల ద్వారా అభిమానులను అలరించే ప్రయత్నం చేశారు. మీరు ఏ మల్లు యాక్టర్ ? అని ఇన్ స్టా ఫిల్టర్‏లో అల్లు అర్జు్న్ చెక్ చేసుకోగా.. మాలీవుడ్ యాక్టర్స్ అందరిలో విలక్షణ నటుడు కుంచాకో బోబన్‏ను మ్యాచ్ చేసి చూపించింది. ఈ వీడియోను బన్నీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. ఫన్ స్టఫ్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కుంచాకో బోబన్ మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్నారు. ఇప్పటివరకు ఈ హీరో దాదాపు 90 సినిమాల్లో నటించారు. విభిన్నమైన చిత్రాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్నారు. కేవలం కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న నిఫా వైరస్, మిడ్ నైట్ మర్డర్స్, నీడ వంటి డబ్బింగ్ చిత్రాలతో ఆకట్టుకుంటున్నాడు.

ట్వీట్..

Also Read: Prabhas: ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం అడిషన్స్.. యంగ్ రెబల్ స్టార్‏తో నటించే ఛాన్స్ అందుకొండిలా..

Bigg Boss 5 telugu: పోటీ వీరి మధ్యనే.. టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్లే.. సోషల్ మీడియాలో సర్వేలతో ఆరాలు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu