AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘రేసుగుర్రం’ రీ రిలీజ్.. థియేటర్‌లోకి గుర్రాలను తీసుకొచ్చిన అల్లు అర్జున్ ఫ్యాన్స్.. వీడియో ఇదిగో

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజును పురుస్కరించుకుని బుధవారం (ఏప్రిల్ 08) రేసుగుర్రం సినిమాను మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేశారు. అయితే ఉత్సాహానికి మారుపేరైన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇక్కడ కూడా తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఏకంగా థియేటర్లలోకి..

'రేసుగుర్రం' రీ రిలీజ్.. థియేటర్‌లోకి  గుర్రాలను తీసుకొచ్చిన అల్లు అర్జున్ ఫ్యాన్స్.. వీడియో ఇదిగో
Race Gurram Movie Re Release
Basha Shek
|

Updated on: Apr 08, 2026 | 4:47 PM

Share

ఈ మధ్యన సినిమా థియేటర్లలో చిత్ర విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సినీ ప్రేక్షకులు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. కేవలం సినిమా చూడటమే కాకుండా, అందులోని ఐకానిక్ సీన్లను, సినిమా పాటలను, యాక్షన్ సీన్లను రీక్రియెట్ చేస్తూ హంగామా చేస్తున్నారు. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అతని కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన ‘రేస్ గుర్రం’ సినిమాను మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్, శృతి హాసన్ అంద చందాలు, బ్రహ్మానందం కామెడీ, తమన్ పాటలతో అలరించిన ఈ సినిమాకు రీ రిలీజ్ లోనూ భారీ స్పందన వస్తోంది. ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్ ఈ సినిమాను చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే రేసుగుర్రం సినిమా రీ రిలీజ్ ను పురస్కరించుకుని అల్లు అర్జున్ అభిమానులు తమ హీరోపై తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. రేసుగుర్రం టైటిల్‌కు తగ్గట్లుగా కొందరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ థియేటర్ల లోపలికి ఏకంగా నిజమైన గుర్రాలను తీసుకువచ్చారు. థియేటర్ బయట గుర్రాలపై స్వారీ చేస్తూ, అల్లు అర్జున్ పాటలకు డ్యాన్స్ చేస్తూ హంగామా చేశారు బన్నీఫ్యాన్స్.

ప్రస్తుతం ఈ గుర్రాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ‘అభిమానుల్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ వేరయ్యా’.. ‘సినిమా థియేటర్ వద్దకు గుర్రాలను తీసుకురావడం అనే ఐడియా వెరైటీగా ఉంది’ అంటూ స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

థియేటర్ ప్రాంగణంలో గుర్రాలతో అల్లు అర్జున్ ఫ్యాన్స్.. వీడియో

కాగా పుష్ప 2 తో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. రాకా పేరుతో తెరకెక్కుతోన్న ఈ పాన్ వరల్డ్ మూవీలో బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సుమారు రూ.800 కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇంట్లో ఈ మొక్కలు పెట్టకండి.. కుటుంబంలో కలహాలు, ఆర్థిక సమస్యలు..
ఇంట్లో ఈ మొక్కలు పెట్టకండి.. కుటుంబంలో కలహాలు, ఆర్థిక సమస్యలు..
‘కింగ్‌ ఆఫ్‌ పాప్‌’ మైఖేల్ జాక్సన్‌.. జీవితంలో ఇంత విషాదం ఉందా?
‘కింగ్‌ ఆఫ్‌ పాప్‌’ మైఖేల్ జాక్సన్‌.. జీవితంలో ఇంత విషాదం ఉందా?
కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్.. మానస్ మాటలు మరింత ఆజ్యం..
కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్.. మానస్ మాటలు మరింత ఆజ్యం..
వాట్సప్ ద్వారా కరెంట్, వాటర్ బిల్లు చెల్లించడం ఎలా..?
వాట్సప్ ద్వారా కరెంట్, వాటర్ బిల్లు చెల్లించడం ఎలా..?
కోహ్లి ఆదర్శంతో UPSCలో 3వ ర్యాంక్ సాధించిన అనన్య.. సక్సెస్ స్టోరీ
కోహ్లి ఆదర్శంతో UPSCలో 3వ ర్యాంక్ సాధించిన అనన్య.. సక్సెస్ స్టోరీ
ఆయన పాటలు ప్రత్యేకం.. ఇప్పటికీ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్స్
ఆయన పాటలు ప్రత్యేకం.. ఇప్పటికీ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్స్
ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు
ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు
బ్రిక్స్‌లో భారత్‌: ప్రశ్నార్థకం నుంచి కీలక శక్తిగా
బ్రిక్స్‌లో భారత్‌: ప్రశ్నార్థకం నుంచి కీలక శక్తిగా
భూమిలోంచి ఉబికివస్తున్న వేడి నీరు.. ఈ ఊర్లో ఎక్కడ చూసినా ఇదే సీన్
భూమిలోంచి ఉబికివస్తున్న వేడి నీరు.. ఈ ఊర్లో ఎక్కడ చూసినా ఇదే సీన్
తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది.. ఇప్పుడు పెద్ద కంపెనీకి ..
తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది.. ఇప్పుడు పెద్ద కంపెనీకి ..