Allu Arjun: ఇప్పుడు పుష్పరాజ్ టర్న్.. గ్లోబల్ మార్కెట్‌ను బన్నీ బ్రాండ్‌ రూల్ చేస్తుందా?

Pushpa 2 Movie: ఇప్పుడు ఐకన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) టర్న్ వచ్చింది. పుష్ప, పుష్ప 2 సినిమాతో బ్యాక్ టు బ్యాక్‌ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు అల్లు అర్జున్‌. దీంతో నేషనల్ లెవల్‌ లో బన్నీ ఇమేజ్‌ పీక్స్‌ కు చేరింది. ఇప్పుడు మన బన్నీని గ్లోబల్ రేంజ్‌ లో చూడాలని కోరుకుంటున్నారు అభిమానులు.

Allu Arjun: ఇప్పుడు పుష్పరాజ్ టర్న్.. గ్లోబల్ మార్కెట్‌ను బన్నీ బ్రాండ్‌ రూల్ చేస్తుందా?
Allu Arjun
Follow us
Satish Reddy Jadda

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 06, 2024 | 4:17 PM

మన హీరోలు బౌండరీస్‌ దాటేస్తున్నారు. తెలుగు సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో నిలబెట్టిన హీరోలు అదే జోరులో వరల్డ్ మార్కెట్‌ లో జెండా పాతేందుకు ట్రై చేస్తున్నారు. ఈ విషయంలో కొంత మంది సక్సెస్ అయ్యారు కూడా. బాహుబలితో బిగ్ హిట్ అందుకున్న ప్రభాస్‌ అదే జోరులో ఇంటర్నేషనల్ ఆడియన్స్‌ కు దగ్గరయ్యారు. ముఖ్యంగా జపాన్‌ లో బాహుబలికి సపరేట్ ఫ్యాన్స్‌ బేస్‌ క్రియేట్ అయ్యింది. బాహుబలి తరువాత ప్రభాస్ చేసిన సినిమాలు కూడా జపాన్‌ లో మంచి వసూళ్లు సాధించాయి.

ప్రభాస్‌ తరువాత పాన్ ఇండియా హీరోలు చాలా మంది అదర్ కంట్రీస్‌ లో మార్కెట్‌ క్రియేట్ చేసుకునేందుకు ట్రై చేశారు. ట్రిపులార్ సినిమాతో గ్లోబల్ మార్కెట్‌ లోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ కు కూడా గ్రాండ్ వెల్‌కం దక్కింది. వీళ్లందరి కంటే ముందే గ్లోబల్ హీరోగా ప్రూవ్ చేసుకున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్‌. పాన్ ఇండియా అన్న పదమే లేని రోజుల్లో సింగపూర్, మలేషియా లాంటి చోట్ల స్ట్రాంగ్ ఫ్యాన్‌ బేస్‌ ను సొంతం చేసుకున్నారు.

ఇప్పుడు అల్లు అర్జున్ టర్న్ వచ్చింది. పుష్ప, పుష్ప 2 సినిమాతో బ్యాక్ టు బ్యాక్‌ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు అల్లు అర్జున్‌. దీంతో నేషనల్ లెవల్‌ లో బన్నీ ఇమేజ్‌ పీక్స్‌ కు చేరింది. ఇప్పుడు మన ఐకాన్‌ స్టార్‌ ను గ్లోబల్ రేంజ్‌ లో చూడాలని కోరుకుంటున్నారు అభిమానులు. అందుకే పుష్ప 2ను ఫారిన్ లాంగ్వేజెస్‌ లోకి డబ్ చేసి రిలీజ్ చేస్తే బాగుంటుందన్న టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతానికి పుష్ప 2 పారిన్‌ లాంగ్వేజెస్‌ లో రిలీజ్ చేయటం గురించి చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ పాన్ ఇండియా రేంజ్‌ లో బిగ్ హిట్ అయిన సినిమాలను ఫారిన్ లాంగ్వేజెస్‌ లో రిలీజ్ చేయటం అన్నది ఆనవాయితీగా వస్తుంది. అందుకే ఆ సాంప్రదాయాన్ని పుష్ప మేకర్స్ కూడా కొనసాగించాలని కోరుతున్నారు ఫ్యాన్స్‌. ఆల్రెడీ తెలుగు సినిమాలు సత్తా చాటిన జపాన్‌, చైనా లాంటి దేశాల్లో పుష్ప 2 రిలీజ్ అయితే కలెక్షన్ల సునామీ పక్కా అని నమ్ముతోంది అల్లు ఆర్మీ.

అల్లు అర్జున్ ఇన్‌స్టా పోస్ట్..

కంటెంట్ పరంగానూ పుష్ప 2కి గ్లోబల్ అప్పీల్ ఉంటుందన్నది అభిమానుల మాట. అల్లు అర్జున్ అల్టీమేట్ పర్ఫామెన్స్ ఇతర దేశాల్లోని సినీ ప్రేక్షకులను కూడా కచ్చితంగా మెప్పిస్తుందని నమ్ముతున్నారు. ప్రజెంట్ సక్సెస్‌ జోష్‌ లో ఉన్న టీమ్‌ కాస్త గ్యాప్‌ తీసుకున్న ఫారిన్ లాంగ్వేజ్‌ మీద కూడా కాన్సన్‌ ట్రేట్ చేస్తుందేమో చూడాలి.