Allu Arjun Birthday: ఐకాన్ స్టార్ అంటార్రా బాబు.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌కు వెల్లువెత్తుతున్న విషెస్..
పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ రెట్టింపయ్యింది. ఇప్పుడు అతనితో సినిమాలు తీసేందుకు స్టార్ డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. అయితే అల్లు అర్జున్ మాత్రం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీకి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో దర్శకుడు అట్లీకి చాలా డిమాండ్ ఉంది. ఇక నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. పాన్ ఇండియా స్టార్ గా ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు. సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ అభిమానులు, సెలబ్రెటీలు బన్నీకి విషెస్ తెలుపుతున్నారు. అల్లు అర్జున్ తన సినీ ప్రస్థానాన్ని 2003లో “గంగోత్రి” చిత్రంతో ప్రారంభించాడు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తర్వాత “ఆర్య”, “బన్నీ”, “దేశముదురు”, “పరుగు”, “సన్ ఆఫ్ సత్యమూర్తి” వంటి హిట్ సినిమాలతో స్టార్‌డమ్ సంపాదించాడు. అల్లు అర్జున్ కు పుష్ప కు ముందు “స్టైలిష్ స్టార్” అనే బిరుదు ఉంది. అల్లు అర్జున్ డ్యాన్స్ , స్టైల్ తో పాపులర్ అయ్యాడు. 2021లో వచ్చిన “పుష్ప: ది రైజ్” చిత్రంతో ఆయన పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాడు, ఈ సినిమా భారీ విజయం సాధించింది.
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకున్నాడు. పుష్ప రాజ్ గా నటించి మెప్పించాడు అల్లు అర్జున్. ఇక ఆతర్వాత వచ్చిన పుష్ప 2 సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఏకంగా రూ. 1800కోట్లకు పైగా వసూల్ చేసింది. అల్లు అర్జున్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. అల్లు అర్జున్ 2011లో స్నేహా రెడ్డిని వివాహం చేసుకున్నాడు, వీరికి ఇద్దరు పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హ.
సినిమాలతో పాటు ఫ్యామిలీకి కావాల్సినంత టైం ఇస్తుంటాడు అల్లు అర్జున్. ఆయన భార్య సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పిల్లలతో గడిపే క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇక అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. సన్ పిచర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ అల్లు అర్జున్ ఓ సినిమా చేస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా సెలబ్రెటీలు కూడా బన్నీకి విషెస్ తెలుపుతున్నారు.
Gear up for the Landmark Cinematic Event⚡✨#AA22xA6 – A Magnum Opus from Sun Pictures💥@alluarjun @Atlee_dir #SunPictures #AA22 #A6 pic.twitter.com/MUD2hVXYDP
— Sun Pictures (@sunpictures) April 8, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
