Allu Arjun Arrest Live Updates: అల్లు అర్జున్ అరెస్ట్.. నాంపల్లి కోర్లులో హాజరుపరిచిన పోలీసులు

Rajitha Chanti

| Edited By: Rajeev Rayala

Updated on: Dec 13, 2024 | 4:06 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‏ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం నుంచి ముందుగా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం బన్నీని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ను తీసుకెళ్లారు. బన్నీ వెంటే అల్లు అరవింద్, అల్లు శిరీష్ సైతం పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.

Allu Arjun Arrest Live Updates: అల్లు అర్జున్ అరెస్ట్.. నాంపల్లి కోర్లులో హాజరుపరిచిన పోలీసులు
Allu Arjun

LIVE NEWS & UPDATES

  • 13 Dec 2024 04:00 PM (IST)

    కోర్టు వెళ్లిన అల్లు అరవింద్, త్రివిక్రమ్

    అల్లు అర్జున్ ను నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఈ క్రమంలో కోర్టు దగ్గర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా ఇప్పటికే కోర్టుకు అల్లు అరవింద్, త్రివిక్రమ్  చేరుకున్నారని తెలుస్తుంది.

  • 13 Dec 2024 03:46 PM (IST)

    అల్లు అర్జున్ అరెస్టు చేసిన తీరును తీవ్రంగా ఖండిస్తున్న…: కౌశిక్ రెడ్డి

    అల్లు అర్జున్ అరెస్టు చేసిన తీరును తీవ్రంగా ఖండిస్తున్న. అల్లు అర్జున్ ఫ్యాన్ ఇండియా స్టార్.. ఆయన్ను బెడ్ రూమ్ వరకు వెళ్లి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. అల్లు అర్జున్ అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంది..?పుష్ప సినిమా విడుదల రోజు క్రౌడ్ విపరీతంగా ఉంటుందని ప్రభుత్వానికి తెలియదా.? రేవంత్ రెడ్డి చేసే ఇలాంటి పనులు తెలంగాణ రాష్ట్రానికే చెడ్డ పేరు తెస్తున్నాయని కౌశిక్ రెడ్డి అన్నారు.

  • 13 Dec 2024 03:40 PM (IST)

    అల్లు అర్జున్ అరెస్ట్ పై రియాక్ట్ అయిన బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్

    అల్లు అర్జున్ అరెస్ట్ పై బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ రియాక్ట్ అయ్యాడు. జైపూర్‌లో జరిగిన ఈవెంట్‌లో మాట్లాడాడు వరుణ్‌. యాక్టర్‌ ఒక్కరే అన్ని విషయాలు చూసుకోలేరు. జరిగిన ఘటన చాలా దురదృష్టకరం. కానీ ఈ ఘటనకు ఒక్కళ్లనే బాధ్యులను చేయటం సరికాదు

  • 13 Dec 2024 03:38 PM (IST)

    జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం: హరీష్ రావు

    అసలు బెన్ఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు..? , ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు?, సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. దీనికి అసలు కారకులు, రాష్ట్ర పాలకులే. చర్యలు తీసుకోవలసింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పైనే.. జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు హరీష్ రావు

  • 13 Dec 2024 03:33 PM (IST)

    మేజిస్ట్రేట్ ముందు అల్లు అర్జున్

    మేజిస్ట్రేట్ ముందు అల్లు అర్జున్ ను హాజరుపరిచిన పోలీసులు. జడ్జ్ కు కేసు వివరాలను తెలుపుతున్నారు పోలీసులు.

  • 13 Dec 2024 03:15 PM (IST)

    నాంపల్లి కోర్టుకు చేరుకున్న అల్లు అర్జున్.

    నాంపల్లి కోర్టుకు చేరుకున్న అల్లు అర్జున్. 14 రోజులు రిమాండ్ కోరేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది.

  • 13 Dec 2024 03:14 PM (IST)

    అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించిన కేఏ పాల్

    చంద్రబాబు నాయుడు కందుకూరు వెళ్ళినపుడు తొక్కిసలాటలో 8 మంది, గుంటూరులో ముగ్గురు, పుష్కరాల్లో 23 మంది చనిపోయారు. మరి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారా? రాజకీయ నాయకులకు ఒక న్యాయం.. నటులకు, సామాన్య ప్రజలకు ఒక న్యాయమా? – కేఏ పాల్

  • 13 Dec 2024 03:11 PM (IST)

    అల్లుఅర్జున్‌కు ముగిసిన వైద్య పరీక్షలు

    గాంధీ ఆసుపత్రిలో అల్లుఅర్జున్‌కు ముగిసిన వైద్య పరీక్షలు. నాంపల్లి కోర్డుకు అల్లు అర్జున్‌ తరలింపు.

  • 13 Dec 2024 03:11 PM (IST)

    అల్లు అర్జున్ అరెస్ట్ దుర్మార్గమైన చర్య, అగౌరవకరం: బండి సంజయ్

    జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ను కనీసం బట్టలు మార్చుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా నేరుగా బెడ్ రూం నుండి తీసుకెళ్లడం దుర్మార్గమైన చర్య, అగౌరవకరం.సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ దుర్మరణం చెందడం చాలా దురదృష్టకరం, అయితే భారీ జనసందోహాన్ని అదుపు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఇది ఎత్తిచూపుతోందని బండి సంజయ్ అన్నారు.

  • 13 Dec 2024 03:00 PM (IST)

    అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

    అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇందులో నా జోక్యం ఏమీ ఉండదు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

  • 13 Dec 2024 02:59 PM (IST)

    ఆసక్తికరంగా మారిన సంధ్య థియేటర్ లేఖ

    ఆసక్తికరంగా మారిన సంధ్య థియేటర్ లేఖ, ముందుగానే సీపీకి సెక్యూరిటీ  కోరాం అని లేఖలో పేరుకున్న సంధ్య థియేటర్.

  • 13 Dec 2024 02:57 PM (IST)

    అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న మెగాస్టార్

    అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ

  • 13 Dec 2024 02:56 PM (IST)

    గాంధీ ఆసుపత్రిలో దగ్గర భారీ బందోబస్త్

    గాంధీ ఆసుపత్రిలో దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. ఆసుపత్రి చుట్టూ భారీగా చేరుకున్న అల్లు అర్జున్ అభిమానులు.

  • 13 Dec 2024 02:51 PM (IST)

    గాంధీ హాస్పటల్‌కు అల్లు అర్జున్

    గాంధీ హాస్పటల్ కు అల్లు అర్జున్ ను తరలించిన పోలీసులు. కొద్దిసేపట్లో అల్లు అర్జున్ కు వైద్య పరీక్షలు నిర్వహించనున్న వైద్యులు

  • 13 Dec 2024 02:38 PM (IST)

    అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై విచారణ 4 గంటలకు

    హైకోర్టులో అల్లు అర్జున్‌ క్వాష్‌ పిటిషన్ వేశారు.  తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు క్వాష్‌ చేయాలని పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటలకు విచారిస్తామని కోర్టు తెలిపింది.  అరెస్ట్ చేసిన విధానంపై కూడా వాదనలు వింటామని వెల్లడించింది.

  • 13 Dec 2024 02:03 PM (IST)

    అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసింది ఈ కేసులోనే.. FIR కాపీ

    అల్లు అర్జున్‌ను రిమాండ్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు చిక్కడపల్లి పోలీసులు. మధ్యాహ్నం 2:30 గంటలకు వైద్య పరీక్షల కోసం ఉస్మానియా హాస్పిటల్‌కు అల్లు అర్జున్‌ను తరలించనున్న పోలీసులు.

  • 13 Dec 2024 02:02 PM (IST)

    అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేశాం: సీపీ

    అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేశామని సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

  • 13 Dec 2024 02:00 PM (IST)

    కాసేపట్లో అల్లు అర్జున్‌ క్వాష్‌ పిటిషన్‌పై విచారణ..

    కాసేపట్లో అల్లు అర్జున్‌ క్వాష్‌ పిటిషన్‌పై విచారణ.. సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఆర్డర్‌ ఇవ్వాలని లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేసిన అల్లు అర్జున్‌.. పిటిషన్‌పై మధ్యాహ్నం 2.30కి విచారిస్తామన్న హైకోర్టు

  • 13 Dec 2024 01:58 PM (IST)

    పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్న బన్నీ ఫ్యాన్స్..

    అల్లు అర్జున్‏ను అరెస్ట్ చేయడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలట ఘటనలో బన్నీ నేరస్తుడు కాదంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్నారు.

  • 13 Dec 2024 01:57 PM (IST)

    చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ మామ..

    చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ మామ కె. చంద్రశేఖర్ రెడ్డి చిక్కడపల్లి పీఎస్ కు చేరుకున్నారు.

  • 13 Dec 2024 01:55 PM (IST)

    అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై కేటీఆర్‌ రియాక్షన్

    అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం పాలకుల అభద్రతాభావానికి ఇది పరాకాష్ట అన్నారు కేటీఆర్. జరిగిన ఘటనకు నేరుగా బాధ్యుడు కాని అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయండి.. అలాగే సాధారణ నేరస్తుడిగా ట్రీట్‌ చేయడం సరికాదంటూ ట్వీట్ చేశారు. ప్రభుత్వ తీవ్రచర్యను ఖండిస్తున్నానని అన్నారు. హైడ్రా కూల్చివేతలతో ఇద్దరి చావుకు బాధ్యుడైన రేవంత్‌రెడ్డిని కూడా ఇదే లాజిక్‌తో అరెస్ట్‌ చేయాలని అన్నారు కేటీఆర్‌.

  • 13 Dec 2024 01:52 PM (IST)

    బన్నీ అరెస్ట్ సమయంలో స్నేహ భావోద్వేగం..

    అల్లు అర్జున్‏ను అరెస్ట్ చేస్తున్న సమయంలో ఆయన భార్య స్నేహారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఆకస్మాత్తుగా పోలీసులు ఇంటికి రావడంతో టెన్షన్ పడిన స్నేహాకు భుజం తట్టి ధైర్యం చెప్పారు బన్నీ. అల్లు అర్జున్ ను స్టేషన్‌కి తీసుకెళ్లేప్పుడు కన్నీరుపెట్టుకున్నారు స్నేహారెడ్డి.

  • 13 Dec 2024 01:51 PM (IST)

    గాంధీ ఆసుపత్రికి అల్లు అర్జున్..

    అల్లు అర్జున్‌‏ను చిక్కడపల్లి PS నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించనున్నారు పోలీసులు. ఉస్మానియాలో వైద్య పరీక్షల తర్వాత బన్నీని నాంపల్లి కోర్టుకు తరలించనున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్‌ రిమాండ్‌ రిపోర్ట్‌ రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం బన్నీ స్టేట్‌మెంట్‌ రికార్డు చేస్తున్నారు పోలీసులు.

  • 13 Dec 2024 01:47 PM (IST)

    నాలుగు సెక్షన్స్ కింద కేసు నమోదు..

    అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదైంది. 105, 118(1), రెడ్‌ విత్‌ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యాయి. 105 సెక్షన్‌ నాన్‌బెయిలబుల్ కేసు నమోదు అయింది.

  • 13 Dec 2024 01:46 PM (IST)

    అల్లు అర్జున్ అరెస్ట్ ఇలా జరిగింది..

    • 11.45AM – అల్లు అర్జున్‌ ఇంటికెళ్లిన పోలీసులు
    • 12PM – అరెస్ట్‌ చేస్తున్నామని అల్లుఅర్జున్‌కి చెప్పిన పోలీసులు
    • 12:10PM – బెడ్రూమ్‌లోకి వచ్చేస్తారా అంటూ నిలదీసిన అల్లుఅర్జున్‌
    • 12:15PM – అల్లు అర్జున్‌ అరెస్టు
    • 12:20PM – జూబ్లీహిల్స్‌ నివాసం నుంచి తరలింపు
    • 1PM – చిక్కడపల్లి పీఎస్‌కు అల్లు అర్జున్‌ తరలింపు
    • 1:15PM – రిమాండ్‌ రిపోర్ట్ రెడీ చేస్తున్న పోలీసులు
  • 13 Dec 2024 01:45 PM (IST)

    పోలీసుల అదుపులో అల్లు అర్జున్

    సంధ్య థియేటర్ తొక్కిసలట ఘటనలో అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు చిక్కడపల్లి పోలీసులు. అనంతరం బన్నీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‏ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం నుంచి ముందుగా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం బన్నీని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ను తీసుకెళ్లారు. బన్నీ వెంటే అల్లు అరవింద్, అల్లు శిరీష్ సైతం పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ‘పుష్ప 2’ బెనిఫిట్‌ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో బన్నీని అదుపులోకి తీసుకున్నారు.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Published On - Dec 13,2024 1:43 PM

Follow us