AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ 2nd ODI: రెండో వన్డే నుంచి ఇద్దరు ఔట్.. ఆ ప్లేయర్ కోసం సడన్‌గా వ్యూహం మార్చిన గంభీర్.?

India vs New Zealand 2nd ODI: ఒకవేళ భారత్ ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ సొంతం అవుతుంది. లేదంటే సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డేపై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే, రెండో వన్డేలోనే గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని గిల్ సేన కోరుకుంటుంది.

IND vs NZ 2nd ODI: రెండో వన్డే నుంచి ఇద్దరు ఔట్.. ఆ ప్లేయర్ కోసం సడన్‌గా వ్యూహం మార్చిన గంభీర్.?
Gautam Gambhir
Venkata Chari
|

Updated on: Jan 14, 2026 | 7:15 AM

Share

IND vs NZ 2nd ODI: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో పోరుకు రాజ్ కోట్ వేదిక కానుంది. వడోదరలో జరిగిన తొలి వన్డేలో అద్భుత విజయం సాధించిన శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమ్ ఇండియా, ఈ మ్యాచ్‌లోనూ గెలిచి 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అయితే, రెండో వన్డే కోసం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జట్టులో రెండు కీలక మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది.

సుందర్ స్థానంలో బదోని అరంగేట్రం?

తొలి వన్డేలో బౌలింగ్ చేస్తూ గాయపడిన ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. బీసీసీఐ ఇప్పటికే అతడిని స్క్వాడ్ నుంచి విడుదల చేసింది. సుందర్ స్థానంలో యువ ఆటగాడు ఆయుష్ బదోనిని తొలిసారి భారత జట్టులోకి తీసుకున్నారు. రాజ్ కోట్ వన్డేలో సుందర్ పోషించాల్సిన పాత్రను బదోనికి అప్పగించాలని గంభీర్ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ రేసులో నితీష్ కుమార్ రెడ్డి పేరు వినిపిస్తున్నప్పటికీ, బదోని వైపే కోచ్ మొగ్గు చూపే అవకాశం ఉంది.

బౌలింగ్ విభాగంలో మార్పు: అర్ష్‌దీప్ సింగ్ రీఎంట్రీ! తొలి వన్డేలో భారత పేసర్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. మహ్మద్ సిరాజ్ మినహా, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రసిద్ధ్ కృష్ణ: 9 ఓవర్లలో 60 పరుగులు ఇచ్చాడు.

హర్షిత్ రాణా: 10 ఓవర్లలో 65 పరుగులు ఇచ్చాడు (బ్యాటింగ్‌లో 29 పరుగులు చేసినప్పటికీ బౌలింగ్‌లో విఫలమయ్యాడు).

ఈ నేపథ్యంలో, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ను రెండో వన్డేలో తుది జట్టులోకి తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. ప్రసిద్ధ్ కృష్ణను పక్కన పెట్టి అర్ష్‌దీప్‌కు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. కొత్త బంతితో స్వింగ్ చేయడమే కాకుండా, డెత్ ఓవర్లలో యార్కర్లతో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో అర్ష్‌దీప్ దిట్ట.

తొలి వికెట్ కోసం నిరీక్షణకు చెక్..!

వడోదర వన్డేలో టీమ్ ఇండియా మొదటి వికెట్ తీయడానికి దాదాపు 21.4 ఓవర్ల పాటు వేచి చూడాల్సి వచ్చింది. కొత్త బంతితో వికెట్లు తీయడంలో విఫలమవ్వడం భారత్‌కు ప్రతికూలంగా మారింది. అర్ష్‌దీప్ జట్టులోకి వస్తే, సిరాజ్‌తో కలిసి పవర్ ప్లేలోనే ప్రత్యర్థికి షాక్ ఇచ్చే అవకాశం ఉంటుంది. రాజ్ కోట్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించినా, అర్ష్‌దీప్ వంటి బౌలర్ వైవిధ్యాన్ని ప్రదర్శించగలడు.

రాజ్ కోట్ వన్డేకు భారత ప్రాబబుల్ ఎలెవన్ (Probable XI): శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (కీపర్), శ్రేయస్ అయ్యర్, ఆయుష్ బదోని/నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

రెండో వన్డే నుంచి ఇద్దరు ఔట్.. సడన్‌గా వ్యూహం మార్చిన గంభీర్
రెండో వన్డే నుంచి ఇద్దరు ఔట్.. సడన్‌గా వ్యూహం మార్చిన గంభీర్
దేశంలో 9 కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు.. ఏయే మార్గాల్లో
దేశంలో 9 కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు.. ఏయే మార్గాల్లో
గేట్ 2026 అడ్మిట్ కార్డులు విడుదల.. రాత పరీక్షల తేదీలు ఇవే!
గేట్ 2026 అడ్మిట్ కార్డులు విడుదల.. రాత పరీక్షల తేదీలు ఇవే!
ఎస్‌బీఐ వినియోగదారులకు షాక్‌.. ఏటీఎం విత్‌డ్రా ఛార్జీల పెంపు!
ఎస్‌బీఐ వినియోగదారులకు షాక్‌.. ఏటీఎం విత్‌డ్రా ఛార్జీల పెంపు!
ఏపీ సెట్‌ 2026 పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
ఏపీ సెట్‌ 2026 పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
రూ. 15 లక్షల జీతం ఉన్నా రూపాయి కూడా ట్యాక్స్‌ అక్కర్లేదు..ఎలాగంటే
రూ. 15 లక్షల జీతం ఉన్నా రూపాయి కూడా ట్యాక్స్‌ అక్కర్లేదు..ఎలాగంటే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌ 2026 నోటిఫికేషన్‌ వాయిదా!
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌ 2026 నోటిఫికేషన్‌ వాయిదా!
మళ్లీ అదే జోరు.. ఏ మాత్రం తగ్గని బంగారం, వెండి ధరలు..
మళ్లీ అదే జోరు.. ఏ మాత్రం తగ్గని బంగారం, వెండి ధరలు..
అదిరిపోయే స్కీమ్.. ఒక్కసారి పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ.5,500
అదిరిపోయే స్కీమ్.. ఒక్కసారి పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ.5,500
Horoscope Today: వారికి మంచి ఉద్యోగానికి ఆఫర్ అందే అవకాశం..
Horoscope Today: వారికి మంచి ఉద్యోగానికి ఆఫర్ అందే అవకాశం..