AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లోనూ అట్టర్ ఫ్లాప్.. టీమిండియాకు భారంగా మారిన ఆల్ రౌండర్?

T20 World Cup 2026: టీమిండియా ప్రస్తుతం కివీస్ సిరీస్ ఆడుతోంది. ఆ తర్వాత టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీ ఆడనుంది. ఈ క్రమంలో ఓ ప్లేయర్ టీమిండియాకు భారంగా మారాడు. ఆయన ఎవరు, గంభీర్ ఎంతకాలం భరిస్తాడో చూడాలి.

అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లోనూ అట్టర్ ఫ్లాప్.. టీమిండియాకు భారంగా మారిన ఆల్ రౌండర్?
Team IndiaImage Credit source: X
Venkata Chari
|

Updated on: Jan 14, 2026 | 8:21 AM

Share

Indian Cricket Team: భారత క్రికెట్ జట్టులో ఒక ఆటగాడి విలువ అతని గత ప్రదర్శనలను బట్టి కొలుస్తారు. కానీ నిలకడ లేని ఆట ఎప్పుడూ ప్రమాదకరమే. ప్రస్తుతం టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. గత దశాబ్ద కాలంగా జట్టులో అత్యంత కీలకమైన ఆటగాడిగా గుర్తింపు పొందిన జడేజా, ఇప్పుడు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో విఫలమవుతూ జట్టుకు భారంగా మారుతున్నాడనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మసకబారుతున్న జడేజా బౌలింగ్ మాయాజాలం..

ఒకప్పుడు మిడిల్ ఓవర్లలో పరుగులు కట్టడి చేస్తూ, వికెట్లు పడగొట్టడంలో జడేజా సిద్ధహస్తుడు. కానీ 2025 సీజన్, ఇటీవలి ఛాంపియన్స్ ట్రోఫీ గణాంకాలు పరిశీలిస్తే అతని బౌలింగ్‌లో పదును తగ్గినట్లు స్పష్టమవుతోంది. గత 10 వన్డేల్లో జడేజా వికెట్లు తీసే రేటు గణనీయంగా పడిపోయింది. ప్రత్యర్థి బ్యాటర్లు అతని బౌలింగ్‌ను సులువుగా ఆడుతుండటం మేనేజ్మెంట్‌కు ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు తన కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ తో ప్రత్యర్థులను కట్టడి చేసే ‘సర్’ జడేజా, ఇప్పుడు ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు.

బ్యాటింగ్‌లోనూ నిరాశే..

కేవలం బౌలింగ్ మాత్రమే కాదు, జడేజా బ్యాటింగ్ కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గతంలో లోయర్ ఆర్డర్‌లో వచ్చి మెరుపు వేగంతో పరుగులు చేసే జడేజా, ఇప్పుడు ఒత్తిడిలో వికెట్ పారేసుకుంటున్నాడు. అలాగే, ఎక్కువ బంతులు వృధా చేస్తున్నాడు. వడోదర వన్డేలోనూ జడేజా ప్రదర్శన సగటు కంటే తక్కువగానే ఉంది. ఒక ‘ప్యూర్ ఆల్ రౌండర్’ గా జట్టులో ఉన్నప్పుడు రెండు విభాగాల్లోనూ రాణించాల్సిన బాధ్యత అతనిపై ఉంది, కానీ ప్రస్తుతం రెండింటిలోనూ అతను విఫలమవుతున్నాడు.

ఇవి కూడా చదవండి

అక్షర్, సుందర్ నుంచి గట్టి పోటీ..

జడేజా ఫామ్ కోల్పోతున్న తరుణంలో, బెంచ్ మీద ఉన్న అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో దూసుకువస్తున్నారు. అక్షర్ పటేల్ తన బ్యాటింగ్ మెరుగుపరుచుకోవడమే కాకుండా, బౌలింగ్‌లోనూ పొదుపుగా ఉంటూ జడేజాకు సరైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు. ఇక వాషింగ్టన్ సుందర్ తన పవర్‌ప్లే బౌలింగ్‌తో జట్టుకు కొత్త బలాన్ని ఇస్తున్నాడు.

2027 వరల్డ్ కప్ లక్ష్యం..

టీమ్ మేనేజ్మెంట్, కోచ్ గౌతమ్ గంభీర్ ప్రస్తుతం 2027 వన్డే వరల్డ్ కప్ కోసం రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఫామ్ లేని సీనియర్ ఆటగాళ్లను జట్టులో కొనసాగించడం భారత్‌కు భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు. రాజ్ కోట్ వన్డేలో జడేజాకు మరో అవకాశం ఇస్తారా లేక కఠిన నిర్ణయాలు తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ జడేజా వెంటనే తన లయను అందుకోకపోతే, అతను జట్టుకు ఆస్తి కంటే అప్పుగా మారే ప్రమాదం ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..