AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat kohli : కింగ్ ఈజ్ బ్యాక్..1736 రోజుల నిరీక్షణకు తెర..మళ్ళీ నంబర్-1 సింహాసనంపై విరాట్ కోహ్లీ

Virat kohli : 1736 రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విరాట్ కోహ్లీ మళ్ళీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఐసీసీ అధికారికంగా ఈ జాబితాను విడుదల చేయనుంది. గత రెండు నెలలుగా విరాట్ కోహ్లీ మునుపటి విరాట్ రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు.

Virat kohli : కింగ్ ఈజ్ బ్యాక్..1736 రోజుల నిరీక్షణకు తెర..మళ్ళీ నంబర్-1 సింహాసనంపై విరాట్ కోహ్లీ
Virat
Rakesh
|

Updated on: Jan 14, 2026 | 7:26 AM

Share

Virat kohli : ప్రముఖ హాలీవుడ్ సినిమా లార్డ్ ఆఫ్ ద రింగ్స్‎లో ఒక పవర్ ఫుల్ డైలాగ్ ఉంటుంది.. ద రిటర్న్ ఆఫ్ ద కింగ్. సరిగ్గా ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ విషయంలో ఇదే జరుగుతోంది. దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మళ్ళీ తన పాత సామ్రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు. ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ మళ్ళీ నంబర్-1 స్థానానికి చేరుకోవడం ఖాయమైపోయింది. బుధవారం మధ్యాహ్నం ఐసీసీ అధికారికంగా ఈ జాబితాను విడుదల చేయనుంది. గత రెండు నెలలుగా విరాట్ కోహ్లీ మునుపటి విరాట్ రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో విరుచుకుపడటమే కాకుండా, తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో 93 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మెరుపు ప్రదర్శనలే అతడిని మళ్ళీ అగ్రస్థానంలో కూర్చోబెట్టాయి. 2021 ఏప్రిల్ 13న పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజం చేతిలో కోల్పోయిన తన నంబర్-1 ర్యాంకును, సరిగ్గా 1736 రోజుల తర్వాత కోహ్లీ తిరిగి దక్కించుకోవడం విశేషం.

తొలిసారి నంబర్-1 ఎప్పుడు?

2008లో అండర్-19 వరల్డ్ కప్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన కోహ్లీ, చాలా వేగంగా టీమిండియాలోలో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 2010 నాటికే టాప్-5 ర్యాంకింగ్స్‌లోకి దూసుకొచ్చిన విరాట్, 2013 నవంబర్‌లో తొలిసారి ప్రపంచ నంబర్-1 వన్డే బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. అయితే అప్పట్లో సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ నుంచి గట్టి పోటీ ఉండటంతో ఆ స్థానం మారుతూ ఉండేది.

ఆ నాలుగేళ్లూ కోహ్లీ సామ్రాజ్యమే

2017 నుంచి 2021 వరకు వన్డే క్రికెట్‌లో కోహ్లీ ప్రభంజనం మామూలుగా లేదు. డివిలియర్స్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్న కోహ్లీ, వరుసగా 1500 రోజులకు పైగా ఆ స్థానంలోనే కొనసాగాడు. 2018లో కోహ్లీ 909 రేటింగ్ పాయింట్లను సాధించి చరిత్ర సృష్టించాడు. 21వ శతాబ్దంలో వన్డే క్రికెట్ చరిత్రలో ఏ బ్యాటర్ కూడా ఇన్ని పాయింట్లు సాధించలేదు. ఇప్పుడు వన్డేల్లో 53 సెంచరీలతో సరికొత్త చరిత్ర సృష్టించిన విరాట్, తన కిరీటాన్ని మళ్ళీ ధరించబోతున్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విశాఖలో నేవీ అధికారుల ప్రత్యే విందు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విశాఖలో నేవీ అధికారుల ప్రత్యే విందు
కుక్కర్ వాడుతున్నారా! సేఫ్టీ వాల్వ్ ఎప్పుడు మార్చాలో తెలుసా?
కుక్కర్ వాడుతున్నారా! సేఫ్టీ వాల్వ్ ఎప్పుడు మార్చాలో తెలుసా?
పోషకాల పవర్ హౌస్ కావచ్చు.. వీరికి మాత్రం క్యాబేజీ విషంతో సమానం!
పోషకాల పవర్ హౌస్ కావచ్చు.. వీరికి మాత్రం క్యాబేజీ విషంతో సమానం!
రక్తహీనతను తరిమికొట్టే అమృతం! నేచురల్ ప్రోబయోటిక్.. ఈ ఫుడ్
రక్తహీనతను తరిమికొట్టే అమృతం! నేచురల్ ప్రోబయోటిక్.. ఈ ఫుడ్
పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శివన్న
పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శివన్న
ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షం ‘జనరల్ షెర్మెన్’..నాగరికతల పుట్టుకకు
ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షం ‘జనరల్ షెర్మెన్’..నాగరికతల పుట్టుకకు
’నీర్‘ అభయారణ్యం.. కొడుకు సంరక్షణలో బిజీగా బాలీవుడ్ నటి..!
’నీర్‘ అభయారణ్యం.. కొడుకు సంరక్షణలో బిజీగా బాలీవుడ్ నటి..!
హైదరాబాహైదరాబాద్‌‌ద్‌‌లో మెగా డేటా సెంటర్.. సర్కార్ కసరత్తు షురూ!
హైదరాబాహైదరాబాద్‌‌ద్‌‌లో మెగా డేటా సెంటర్.. సర్కార్ కసరత్తు షురూ!
NPSలో మార్పులు.. పెన్షన్‌ ప్లస్‌ హెల్త్‌!
NPSలో మార్పులు.. పెన్షన్‌ ప్లస్‌ హెల్త్‌!
నెదర్లాండ్ తో పోరుకు సూర్యసేన రెడీ.. రెండు మార్పులతో బరిలోకి?
నెదర్లాండ్ తో పోరుకు సూర్యసేన రెడీ.. రెండు మార్పులతో బరిలోకి?