18 Pages : టైం ఇవ్వు పిల్ల.. కొంచెం టైం ఇవ్వు అంటూ అనుపమతో కలిసి స్టెప్పులేసిన అల్లు అరవింద్, సుకుమార్..
ముఖ్యంగా అనుపమ, నిఖిల్ నటనకు ప్రశంసలు అందుకున్నారు. అలాగే ఈ చిత్రంలోని డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో సుకుమార్ మరోసారి తన విలక్షణత చూపించాడు. ముఖ్యంగా మనసులు కలవాలి కానీ మనుషులు కాదు ప్రేమకు అనేది బాగా చూపించాడు.

ఇటీవల కార్తికేయ 2తో పాన్ ఇండియా క్రేజ్ సంపాందించుకున్న నిఖిల్, అనపమ.. తాజాగా మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు. వీరిద్దరు జంటగా నటించిన 18 పేజెస్ సినిమా డిసెంబర్ 23 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ అందుకుంటూ సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా అనుపమ, నిఖిల్ నటనకు ప్రశంసలు అందుకున్నారు. అలాగే ఈ చిత్రంలోని డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో సుకుమార్ మరోసారి తన విలక్షణత చూపించాడు. ముఖ్యంగా మనసులు కలవాలి కానీ మనుషులు కాదు ప్రేమకు అనేది బాగా చూపించాడు. తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రెషన్స్ గ్రాండ్ గా నిర్వహించింది చిత్రయూనిట్. ఇందులో పాల్గొన్న నిర్మాత అల్లు అరవింద్ సరదాగా అనుపమతో కలిసి డాన్స్ చేశారు.
18 పేజెస్ చిత్రంలోని టైం ఇవ్వు పిల్ల.. కొంచెం టైం ఇవ్వు అంటూ సాగే పాటకు అనుపమతో కలిసి సరదాగా స్టెప్పులేశారు. ఇక వీరిద్దరితోపాటు డైరెక్టర్ సుకుమార్ కూడా డాన్స్ చేశారు. వీరు ముగ్గురు కలిసి నవ్వులు చిందిస్తూ డాన్స్ చేస్తుండగా.. హీరో నిఖిల్ సెల్ఫీ వీడియో తీశారు. అనంతరం నిఖిల్, అనుపమ, అల్లు అరవింద్, సుకుమార్ కలిసి మరోసారి డాన్స్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. ఇక 18 పేజెస్ సూపర్ హిట్ అయినందకు నిఖిల్ కు కంగ్రాట్స్ తెలుపుతున్నారు ఫ్యాన్స్.
ఈ సినిమాను వరుస హిట్స్ అందుకున్న జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాను బన్నీ వాసు నిర్మించగా.. అల్లు అరవింద్ సమర్పించారు. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న అనుపమ.. నిఖిల్.. మరోసారి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల మనసులను హత్తుకున్నారు.




మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.