Masooda: మూవీ లవర్స్‌ను థ్రిల్ చేస్తున్న మసూద.. ఓటీటీలోనూ రికార్డ్.. మీరు చూశారా..?

స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో వచ్చిన ఈ మూవీతో సాయికిరణ్‌ డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు. నవంబర్‌ 18న విడుదలైన మసూద చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ ఓటీటీలోనూ సత్తా చాటుతుంది.

Masooda: మూవీ లవర్స్‌ను థ్రిల్ చేస్తున్న మసూద.. ఓటీటీలోనూ రికార్డ్.. మీరు చూశారా..?
Masooda Movie
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 24, 2022 | 9:46 PM

ఎలాంటి అంచనాలు లేకుండా నవంబర్‌ 18న  థియేటర్లో రిలీజ్ అయిన మసూద.. అందరికీ దిమ్మ తిరిగే థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియెన్స్ ను ఇచ్చింది. సస్పెన్స్‌తో కూడిన హర్రర్ ఎలిమెంట్స్‌తో.. వన్‌ ఆఫ్‌ ది బెస్ట్ తెలుగు హర్రర్ సినిమాగా హిస్టరీ కెక్కింది. సూపర్ డూపర్ హిట్ టాక్‌తో థియేటర్ల సంఖ్యను పెంచుకుని బాక్సాఫీస్ దగ్గర మోస్ట్ ప్రాఫిటబుల్ సినిమాగా నిలిచింది. ప్రొడ్యూసర్ల జేబులు నింపింది. ఇక ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న ఈ సినిమా.. తాజాగా ఆహా ఓటీటీలోనూ రిలీజ్ అయి… దిమ్మదిరిగే రెస్పాన్స్‌ను రాబట్టుకుంటోంది.

సాయి కిరణ్‌ రైటింగ్ అండ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీలో సంగీత, తిరువీర్, శుభలేఖ సుధాకర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదితరులు కీ రోల్స్ పోషించారు. హర్రర్, సస్పెన్స్ ఎలిమెంట్స్  తెరకెక్కిన ఈసినిమా తాజాగా ఆహా ఓటీటీలో రిలీజై రికార్డు లెవల్‌ వ్యూస్‌ను దక్కించుకుంటోంది.

ఎస్ ! డిసెంబర్ 21నుంచి అచ్చ తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా.. 48 గంటల్లోనే 50 మిలియన్ మినెట్స్ ను వచ్చేలా చేసుకుంది. ఓటీటీ లో నయా రికార్డును క్రియేట్ చేసింది. థ్రిల్లింగ్ హిట్ అనే ట్యాగ్‌తో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.