Naa Saamiranga: ‘నా సామిరంగ’ పై ఇంట్రెస్టింగ్ న్యూస్.. 300 మందితో కింగ్ నాగార్జున్ స్టెప్పులు..
ఈ సినిమాతోనే విజయ్ బిన్ని వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇందులో నాగార్జున మాస్ హీరోగా కనిపించనున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ టైటిల్ సాంగ్ చిత్రీకరిస్తున్నారట. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్లో నా సామిరంగ టైటిల్ సాంగ్ షూట్ చేస్తున్నారని.

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ఇప్పుడు నటిస్తోన్న సినిమా నా సామిరంగ. కొన్నాళ్లుగా వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పుడు చివరి దశలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతోనే విజయ్ బిన్ని వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇందులో నాగార్జున మాస్ హీరోగా కనిపించనున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ టైటిల్ సాంగ్ చిత్రీకరిస్తున్నారట. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్లో నా సామిరంగ టైటిల్ సాంగ్ షూట్ చేస్తున్నారని.. ఈపాటకు ఆస్కార్ అవార్డ్ విజేతలు ఎంఎం కీరవాణి ఫుట్ ట్యాపింగ్ ట్యూన్ కంపోజ్ చేయగా.. చంద్రబోస్ లిరిక్స్ అందిస్తున్నారని తెలుస్తోంది.
ఇందులో నాగార్జునతోపాటు.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అయితే ప్రస్తుతం తెరకెక్కుతున్న నా సామిరంగ టైటిల్ పాటలో మొత్తం 300 మందితో కలిసి నాగ్ స్టెప్పులేయనున్నారట. ఈ పాటకు దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. అలాగే ఇదే పాటలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, నాగార్జున ముగ్గురు కనిపించనున్నారని.. ముగ్గురిపై పాట థియేటర్లలో అదిరిపోయేలా ఉంటుందని అంటున్నారు మేకర్స్. ఈ సినిమాలో కన్నడ భామ ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.
Unveiling the KING Size action, Entertainment & Emotion👑🔥
Celebrate the #NaaSaamiRangaTeaser 🤩
▶️https://t.co/3mlpul7mts#NaaSaamiRanga #NSRForSankranthi
KING 👑 @iamnagarjuna @allarinaresh @mmkeeravaani @vijaybinni4u @itsRajTarun @AshikaRanganath @mirnaaofficial… pic.twitter.com/cwHa7xq4dk
— Srinivasaa Silver Screen (@SS_Screens) December 17, 2023
నాగార్జున, కీరవాణి కాంబోలో రాబోతున్న ఈ మ్యూజిక్ ఆల్బమ్స్ సూపర్ హిట్స్ కావడం ఖాయమంటున్నారు. ఈ సినిమాను పూర్తిగా రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఘోస్ట్ డిజాస్టర్ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న నాగార్జున.. ఇప్పుడు నా సామిరంగ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే సంక్రాంతి రేసులో గుంటూరు కారం, సైంధవ్, ఈగిల్ చిత్రాలు పోటీ పడుతున్నాయి. మరీ నా సామిరంగ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.