Salaar: బాబోయ్.. ప్రభాస్ ఫాలోయింగ్ చూస్తే మతిపోవాల్సిందే.. కాలేజీలోని కంప్యూటర్ ల్యాబ్లో ఏం చేశారో తెలుసా ?..
ఇప్పటివరకు అభిమానులు ఊహించని రేంజ్లో ప్రభాస్‍ను చూపించి సర్ ప్రైజ్ చేశాడు నీల్. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఇప్పటికే పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సలార్ సినిమా సందడి మొదలైంది. గత అర్దరాత్రి నుంచి థియేటర్ల వద్ద సంబరాలు షూరు చేశారు ప్రభాస్ ఫ్యాన్స్. భారీ కటౌట్స్, డిజిటల్ మోషన్ పోస్టర్స్ ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని తెలియజేస్తున్నారు. ఒక్కొక్కరు ప్రభాస్ పై తమ ప్రేమను ఒక్కొ విధంగా చూపిస్తున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా డార్లింగ్ క్రేజ్ పెరిగిపోయింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సలార్ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజుతో ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులకు తెర దించాడు నీల్. ఇప్పటివరకు అభిమానులు ఊహించని రేంజ్లో ప్రభాస్‍ను చూపించి సర్ ప్రైజ్ చేశాడు నీల్. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఇప్పటికే పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సలార్ సినిమా సందడి మొదలైంది. గత అర్దరాత్రి నుంచి థియేటర్ల వద్ద సంబరాలు షూరు చేశారు ప్రభాస్ ఫ్యాన్స్. భారీ కటౌట్స్, డిజిటల్ మోషన్ పోస్టర్స్ ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని తెలియజేస్తున్నారు. ఒక్కొక్కరు ప్రభాస్ పై తమ ప్రేమను ఒక్కొ విధంగా చూపిస్తున్నారు. ఇక ప్రభాస్ సొంత ఊరు భీమవరంలో ఆయన ఫ్యాన్స్ పండగ వాతావరణం సృష్టిస్తున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ విడుదల సందర్భంగా అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. భీమవరం ప్రభాస్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో 1500 మందికి ఏర్పాటు చేసిన అఖండ అన్నదానం కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు ఫ్యాన్స్. అలాగే భీమవరం విష్ణు, SRKR ఇంజనీరింగ్ కాలేజీల్లోని విద్యార్థులు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. అక్కడి విద్యార్థుల్లో ఎక్కువగా డార్లింగ్ ఫ్యాన్స్ ఉన్నారు. సలార్ సినిమా విడుదల సందర్భంగా.. కాలేజీలోని కంప్యూటర్ ల్యాబ్స్ లో ఉన్న అన్ని కంప్యూటర్స్ వాల్ పేపర్స్ గా సలార్ సినిమాలోని ప్రభాస్ ఫోటోస్ పెట్టారు. అన్ని సిస్టమ్స్ లో ప్రభాస్ ఫోటోస్ వాల్ పేపర్స్ పెట్టిన వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియోస్ ప్రభాస్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. డార్లింగ్ పై స్టూడెంట్స్ ప్రేమను చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ వైరలవుతున్నాయి.
SAGI RAMA KRISHNAM RAJU (SRKR) College Bhimavaram. Rebels Mass 🔥🔥#SalaarCeaseFireOnDec22#SALAAR #Prabhas #Bhimavaram#Bhimavaramprabhasfans pic.twitter.com/BpGZzmlwwz
— PRABHAS ARMY BHIMAVARAM (@Bhimavaram_PBFC) December 17, 2023
మరోవైపు హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద అభిమానులు చేసిన సెలబ్రేషన్స్ గురించి చెప్పక్కర్లేదు. సలార్ సినిమా విడుదల సందర్భంగా థియేటర్ వద్ద మ్యూజిక్ కాన్సర్ట్ జరుగుతున్నప్పుడు లైటింగ్స్, హోర్డింగ్స్, సౌండ్ సిస్టం ఎలా రెడీ చేస్తారో.. అలా డిజిటల్ మోషన్ పోస్టర్స్ ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి నుంచి ప్రీమియర్ షో పడే వరకు ఒక మినీ మ్యుూజికల్ కాన్సర్ట్ నడిపారు. ప్రభాస్ పాటలతో రెబల్ స్టార్ అభిమానులు డాన్స్ చేస్తున్న వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అభిమాన హీరో సినిమా రిలీజ్ అంటే.. ఈ రేంజ్లో సెలబ్రెషన్స్ చేస్తారా ? అంటూ ఆశ్చర్యపోతున్నారు .
This is the next level of fan celebrations outside the theater 🔥🔥. I love the way fans adore their idol and celebrate his movies like a festival.
Best wishes to #Prabhas and his fans for #SALAAR on behalf of all Salman Khan fans
— SALMAN KI SENA™ (@Salman_ki_sena) December 21, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
