‘ఫేస్ యాప్‌ఛాలెంజ్‌’కే నాగ్ ఛాలెంజర్!

అక్కినేని నాగార్జున..60 ఏళ్ల వయస్సులోనూ వన్నె తగ్గని నవ మన్మథుడు. ఇప్పటికి ఈ కింగ్ అంటే అమ్మాయిలకు గుండెల్లో గుబులే. వయసు పెరుగుతున్నా ఇంకా హ్యాండ్సమ్‌గా మారుతున్న కింగ్‌ నాగార్జున ఫేస్‌ యాప్‌ ఛాలెంజ్‌కే ఓ ఛాలెంజ్‌లాంటి వారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. సోషల్‌మీడియాలో ‘ఫేస్‌ యాప్‌ ఛాలెంజ్‌’ పేరుతో వివిధ రకాల సెలబ్రిటీల ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. కాగా అన్నపూర్ణ స్టూడియోస్‌ ఓ ఫొటోను షేర్‌ చేసింది. అందులో 2002లో నాగ్‌ ‘మన్మథుడు’ స్టిల్‌, […]

'ఫేస్ యాప్‌ఛాలెంజ్‌'కే నాగ్ ఛాలెంజర్!
Follow us

|

Updated on: Jul 20, 2019 | 10:44 AM

అక్కినేని నాగార్జున..60 ఏళ్ల వయస్సులోనూ వన్నె తగ్గని నవ మన్మథుడు. ఇప్పటికి ఈ కింగ్ అంటే అమ్మాయిలకు గుండెల్లో గుబులే. వయసు పెరుగుతున్నా ఇంకా హ్యాండ్సమ్‌గా మారుతున్న కింగ్‌ నాగార్జున ఫేస్‌ యాప్‌ ఛాలెంజ్‌కే ఓ ఛాలెంజ్‌లాంటి వారని సోషల్ మీడియా కోడై కూస్తోంది.

సోషల్‌మీడియాలో ‘ఫేస్‌ యాప్‌ ఛాలెంజ్‌’ పేరుతో వివిధ రకాల సెలబ్రిటీల ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. కాగా అన్నపూర్ణ స్టూడియోస్‌ ఓ ఫొటోను షేర్‌ చేసింది. అందులో 2002లో నాగ్‌ ‘మన్మథుడు’ స్టిల్‌, 2019లో ఫేస్‌ యాప్ స్టిల్‌ను పక్కపక్కన ఉంచింది. అయితే ప్రజంట్ ‘మన్మథుడు 2’లో ఇంకా యంగ్‌గా ఉన్న నాగ్‌ ఫొటోను అక్కడే యాడ్ చేసింది. ఆయన అందాన్ని తగ్గించడం ఈ యాప్‌ తరం కూడా కాదని వర్ణిస్తూ.. ‘నాగ్‌ ఫేస్‌ యాప్‌ ఛాలెంజ్‌కే ఓ ఛాలెంజ్‌లాంటి వారు’ అని ట్వీట్‌ చేసింది.

అదే విధంగా ‘ఫేస్‌ యాప్‌ ఉపయోగించిన తర్వాత అక్కినేని ఫ్యామిలీ’ అంటూ ఓ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో అక్కినేని ఫ్యామిలి మిగిలిన హీరోలందరూ వృద్ధాప్యంతో కనిపిస్తే.. నాగ్‌ మాత్రం అలానే ఉన్నారు. దీన్ని మంచు లక్ష్మి షేర్‌ చేశారు. ‘నాగ్‌ విషయంలో ఇది నిజమే. ఈ ఫొటో నాకు నచ్చింది. సుశాంత్‌, అఖిల్‌, నాగచైతన్య ఇప్పటి నుంచే నాగ్‌ వద్ద చిట్కాలు నేర్చుకోండి. మా నాన్న విషయంలో మా పరిస్థితి ఇంతే’ అని పేర్కొన్నారు.