Akkineni Nagarjuna: సొంతంగా ప్రైవేట్ జెట్ నుంచి కార్ల కలెక్షన్స్ వరకు.. నాగ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసా..
సినీ పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు నాగ్. 29 ఆగస్టు 1959న జన్మించిన నాగార్జున.. 1986లో ‘విక్రమ్’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు. ఈ సినిమా ద్వారా తన ఇండస్ట్రీలో రంగుల జీవితాన్ని ప్రారంభించాడు. తర్వాత చాలా సినిమాల్లో నటించారు. ఆయన చివరగా నటించిన'ది ఘోస్ట్' 2022లో విడుదలైంది.
టాలీవుడ్ నవ మన్మధుడు అక్కినేని నాగార్జున పుట్టినరోజు నేడు (ఆగస్ట్ 29). ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక నాగార్జునకు సంబంధించిన లేటేస్ట్, రేర్ ఫోటోస్ నెట్టింట పంచుకుంటూ బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్. 64 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తూ కుర్రహీరోలకు సైతం గట్టిపోటీనిస్తున్నారు నాగ్. ఇప్పటికీ చాలా ఫిట్ గా కనిపిస్తూ వరుస సినిమాలతో అలరిస్తున్నారు. సినిమాల్లో హీరోగానే కాదు… వ్యాపారరంగంలోనూ నాగ్ కింగ్ అన్న సంగతి చాలా మందికి తెలియదు. వందల కోట్లకు అధిపతి.. ప్రైవేట్ జెట్ కలిగిన హీరో.. అయినప్పటికీ ఎంతో సింపుల్ గా ఉండేందుకు ఇష్టపడుతుంటారు. నాగార్జునకు కార్లు అంటే అమితమైన ఇష్టం. ఇప్పటివరకు నాగ్ వద్ద ఎన్నో లగ్జరీ కార్స్ ఉన్నాయి.
నాగార్జున జీవితం..
సినీ పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు నాగ్. 29 ఆగస్టు 1959న జన్మించిన నాగార్జున.. 1986లో ‘విక్రమ్’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు. ఈ సినిమా ద్వారా తన ఇండస్ట్రీలో రంగుల జీవితాన్ని ప్రారంభించాడు. తర్వాత చాలా సినిమాల్లో నటించారు. ఆయన చివరగా నటించిన’ది ఘోస్ట్’ 2022లో విడుదలైంది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. ఇక ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు నాగ్. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే.. ఒక్కో సినిమాకు రూ. కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ఇప్పటివరకు నాగ్ దాదాపు రూ.960 కోట్లకు అధిపతి. నెలకు రూ.4 కోట్లు సంపాదిస్తారు. సినిమాలు చేస్తూనే.. అటు వ్యాపారంలో చురుగ్గా ఉంటారు నాగ్.
నాగార్జున కార్ల కలెక్షన్స్..
అక్కినేని నాగార్జునకు కార్లు అంటే చాలా ఇష్టం. ఇటీవలే ఆయన ఇండియాలోనే మొట్ట మొదటి, ఏకైక ఎలక్ర్టిక్ కార్ అయిన కియా EV6ను కొనుగోలు చేశారు. ఈ కారు 18 నిమిషాల్లో ఛార్జ్ చేయగల సామర్థ్యం కలది. దీని ధర రూ.60.95 లక్షలు. అలాగే ఆయన గ్యారేజీలో BMW 7-సిరీస్, ఆడి A7, BMW M6, టయోటా వెల్‌ఫైర్, నిస్సాన్ GT-R, రేంజ్ రోవర్ వోగ్, Mercedes-Benz S450 కార్లు ఉన్నాయి.
నాగార్జున వ్యక్తిగత జీవితం..
విదేశాల్లో ఇంజనీరింగ్ పూర్తిచేసిన నాగార్జున 1984లో దగ్గుబాటి రామానాయుడు కుమార్తె లక్ష్మీని వివాహం చేసుకున్నారు. వీరికి నాగచైతన్య జన్మించారు. కానీ వీరు 1990లో విడిపోయారు. ఆ తర్వాత 1992లో నాగార్జున హీరోయిన్ అమలను పెళ్లి చేసుకున్నరాు. వీరికి అఖిల్ జన్మించారు.
Thanks for all the love and excitement from my fans and the people who made #Manmadhudu a cult classic!! Excited for tomorrow’s #ManmadhuduReRelease #Manmadhudu4K 😊🙏 https://t.co/ilGTwRV1My
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 28, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.