AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thandel Trailer: అదిరిపోయిన తండేల్ ట్రైలర్.. ఇరగదీసిన చైతన్య, సాయి పల్లవి

తండేల్! యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య చేస్తున్న ఈ సినిమా పై ఇప్పుడు మంచి అంచనాలున్నాయి. ప్రీ రిలీజ్‌ బిజినెస్ చాలా బాగా చేస్తుందన్న కామెంట్సు ఉన్నాయి. ఇక ఈ కామెంట్స్ నిజమన్నట్టు ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ 50 కోట్లు పలికిందని వినికిడి.

Thandel Trailer: అదిరిపోయిన తండేల్ ట్రైలర్.. ఇరగదీసిన చైతన్య, సాయి పల్లవి
Thandel
Rajeev Rayala
|

Updated on: Jan 28, 2025 | 8:28 PM

Share

తండేల్! యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య చేస్తున్న ఈ సినిమా పై ఇప్పుడు మంచి అంచనాలున్నాయి. ప్రీ రిలీజ్‌ బిజినెస్ చాలా బాగా చేస్తుందన్న కామెంట్సు ఉన్నాయి. ఇక ఈ కామెంట్స్ నిజమన్నట్టు ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ 50 కోట్లు పలికిందని వినికిడి. ఇక థియేట్రికల్ రైట్స్ మ్యాటర్‌కొస్తే… అవి కూడా రికార్డ్‌ లెవల్లో పలుకుతున్నాయని తెలుస్తోంది. ఇక ఈ విషయం పక్కకు పెడితే గీతా ఆర్ట్స్‌ ప్రస్టీజియస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫిబ్ 7న వరల్డ్ వైడ్ రిలీజ్‌ కానుంది. తాజాగా తండేల్ ట్రైలర్ ను విడుదల చేశారు.

ఈ ట్రైలర్ లో నాగ చైతన్య, సాయి పల్లవి తమ నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా నాగచైతన్య మత్యకారుడిగా అద్భుతంగా ఆకట్టుకున్నాడు. ఉత్తరాంధ్ర యాసతో చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. అలాగే సాయి పల్లవి ఎప్పటిలానే తన సహజ నటనతో కట్టిపడేసింది . అలాగే దేవీ శ్రీ మ్యూజిక్ కూడా అలరించింది. మొత్తంగా ఈ సినిమా ఓ అందమైన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

విడుదలకు ముందే ఈ సినిమా రికార్డు స్థాయిలో డీల్ చేసి కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. తండేల్ మూవీ ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ తండేల్ సినిమా రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసిందని టాక్. నాగ చైతన్య ‘తాండల్’ సినిమా హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్‌తో 40 కోట్లకు డీల్ జరిగిందని తెలుస్తోంది. దాంతో ఈ సినిమా విడుదలకు ముందే 40 కోట్లు రాబట్టింది. ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి