Akhil Akkineni : అయ్యగారి సినిమా పై అక్కినేని అభిమానుల భారీ అంచనాలు..

ప్రామిసింగ్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి ల హై బడ్జెట్ స్టైలిష్, యాక్షన్ థ్రిల్లర్ చిత్రం `ఏజెంట్. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పవర్ఫుల్ పాత్రలో నటుస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Akhil Akkineni : అయ్యగారి సినిమా పై అక్కినేని అభిమానుల భారీ అంచనాలు..
Akhil
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 13, 2022 | 8:15 AM

Akhil Akkineni : ప్రామిసింగ్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి ల హై బడ్జెట్ స్టైలిష్, యాక్షన్ థ్రిల్లర్ చిత్రం `ఏజెంట్. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పవర్ఫుల్ పాత్రలో నటుస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏజెంట్  చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాలో అఖిల్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు . ఇప్పటికే అఖిల్ మేకోవర్ కు అక్కినేని అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇటీవలే  మేకర్స్ సినిమా థియేట్రికల్ విడుదల తేదీని ప్రకటించారు. `ఏజెంట్` చిత్రం స్వాతంత్ర దినోత్సవానికి మూడు రోజుల ముందు ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం దేశభక్తి అంశాలతో రూపొందుతోంది కాబట్టి, స్వాతంత్రదినోత్సవం విడుదలకు అనువైన సమయంగా భావించారు. అంతేకాక ఆగస్ట్ 15వ తేదీ సోమవారం కావడంతో 4 రోజుల వీకెండ్ కూడా కలిసి వచ్చింది.

`ఏజెంట్`లో అఖిల్ యాక్షన్-ప్యాక్డ్ రోల్ లో కనిపించనున్నాడు. స్పై థ్రిల్లర్ గా ఏజెంట్ ఉండనుందని తెలుస్తుంది. మరోవైపు ఈ సినిమాలో మమ్ముట్టి కూడా పవర్ఫుల్ రోల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ఎకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు. సెన్సేషనల్ కంపోజర్ హిప్ హాప్ తమీజ్సంగీతం అందించగా, రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా పై అక్కినేని అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇటీవల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాతో అఖిల్ హిట్ అందుకున్న అని అక్కినేని అభిమానులకు సరిపోలేదు.. ఈసారి ఏజెంట్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. మరి అఖిల్ అక్కినేని అభిమానుల అంచనాలను అందుకుంటాడేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Varun Sandesh: పాన్ ఇండియా సినిమాలో వరుణ్ సందేశ్.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్..

Mirnalini Ravi: నెమలి సోకు సోయగం తో మైమరిపిస్తున మృణాళిని రవి

Viral Photo: అందాల రాశి.. కుర్రకారును పిచ్చెక్కిస్తున్న క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టండి.!