Shruti Haasan: సినిమాలే ఫస్ట్ మిగిలినవన్నీ నెక్స్ట్ అంటున్న అందాల ముద్దుగుమ్మ శ్రుతిహాసన్
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయ్యింది.
Updated on: Mar 13, 2022 | 9:47 AM

కమల్ వారసురాలిగా పరిచయం అయినప్పటికీ ఆయన పేరు వాడకుండా హీరోయిన్ గా నిలదొక్కుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తుంది శ్రుతి.

ఈ మల్టీటాలెంటెడ్ బ్యూటీ ఇతర దేశాల్లోనూ డాన్స్ షో లు.. స్టేజ్ షోలు చేయడం ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుంది.

కెరీర్ బిగినింగ్ స్టేజ్ లోనే పవన్ కళ్యాణ్ కు జోడిగా గబ్బర్ సింగ్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది.

ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ భామ. బాలీవుడ్ లో పలు సినిమాలు చేయడంతో పాటు ప్రభాస్ కి జోడీగా సలార్ సినిమాలో నటిస్తోంది.

బాలయ్య గోపీచంద్ మలినేని సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా హీరోయిన్ గా ఎంపిక అయ్యింది.

అప్పుడో సినిమా ఇప్పుడో సినిమా అన్నట్లుగా కాకుండా రెగ్యులర్గా సినిమాలకు కమిట్ అవుతుంది ఈ బ్యూటీ

మ్యూజిక్ కి చిన్న గ్యాప్ ఇచ్చి ప్రస్తుతానికి శృతిహాసన్ పూర్తి దృష్టి సినిమాలపైనే పెట్టినట్లుగా తెలుస్తుంది




