AGENT Trailer: అదరగొట్టిన అఖిల్.. నెక్ట్స్ లెవల్‌లో ఏజెంట్ మూవీ ట్రైలర్

స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అఖిల్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి

AGENT Trailer: అదరగొట్టిన అఖిల్.. నెక్ట్స్ లెవల్‌లో ఏజెంట్ మూవీ ట్రైలర్
Agent
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 18, 2023 | 9:29 PM

అక్కినేని యంగ్ హీరో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఏజెంట్. ఈ సినిమా పై అక్కినేని అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. చాలా కాలం తర్వాత ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు అఖిల్. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అఖిల్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఏజెంట్ సాంగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఇక ఈ ట్రైలర్ ఆద్యంతో యాక్షన్ సీన్స్ తో నింపేశారు దర్శకుడు సురేందర్ రెడ్డి. ముఖ్యంగా ఫైట్ సీన్స్ ను చాలా స్టైలిష్ గా డిజైన్ చేశారని అర్ధమవుతోంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది.  ఈ సినిమాలో అఖిల్ బీస్ట్ లుక్ లో కనిపించనున్నాడు.

మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.