Akash Puri : ‘నాకు ఇప్పటికిప్పుడు ఒక హిట్ సినిమా కావాలి’.. ఆకాష్ పూరి ఆసక్తికర వ్యాఖ్యలు..

టాలీవుడ్ యంగ్ హీరో ఆకాష్ పూరి(Akash Puri) నటిస్తిస్తున్న లేటెస్ట్ మూవీ చోర్ బజార్. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో మెప్పించిన ఆకాష్. మెహబూబా సినిమా తో హీరోగా మరీన విషయం తెలిసిందే.

Akash Puri : 'నాకు ఇప్పటికిప్పుడు ఒక హిట్ సినిమా కావాలి'.. ఆకాష్ పూరి ఆసక్తికర వ్యాఖ్యలు..
Akash Puri
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 23, 2022 | 5:21 PM

టాలీవుడ్ యంగ్ హీరో ఆకాష్ పూరి(Akash Puri) నటిస్తిస్తున్న లేటెస్ట్ మూవీ చోర్ బజార్. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో మెప్పించిన ఆకాష్. మెహబూబా సినిమాతో హీరోగా మరీన విషయం తెలిసిందే. ఇటీవలే రొమాంటిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆకాష్. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు చోర్ బజార్ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాకు వీఎస్ రాజు నిర్మాత. యూవీ క్రియేషన్స్ సమర్పిస్తున్నది. గెహనా సిప్పీ నాయిక. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలుపుతూ పూరి ఆకాష్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఆకాష్ మాట్లాడుతూ.. పాటలు, ట్రైలర్ చూశాక నాన్న పూరి జగన్నాథ్ ..సినిమా బాగుందిరా గ్రాండ్ గా కనిపిస్తుంది అని చెప్పారు. ఈ సినిమా కథ ఆయనకు తెలియదు. నీ సినిమాల నిర్ణయాలు నువ్వే తీసుకో, ధైర్యంగా ముందుకెళ్లు అంటారు. నాన్న ఆయన పనుల్లో బిజీగా ఉంటారు. నేను కథ వినేప్పుడే ఒక ప్రేక్షకుడిగా వింటాను. ఈ సినిమాను దర్శకుడు జీవన్ రెడ్డి మీదున్న నమ్మకంతో చేశాను. చానార్ వంటి లొకేషన్స్ లో షూటింగ్ చేశాం. ఒక పెద్ద సెట్ లో కూడా చిత్రీకరణ జరిపాం అన్నారు ఆకాష్. నాకూ వెను వెంటనే సినిమాలు చేయాలని ఉంటుంది. కానీ పరిస్థితులు వేరుగా ఉంటాయి. నాకు ఇప్పటికిప్పుడు ఒక హిట్ సినిమా కావాలి. అందుకోసం ప్రయత్నిస్తున్నా. రొమాంటిక్ సినిమా వేడుకలో నేను హీరోగా నిలబడతాను అని వేదిక మీద చెప్పాను. అందుకు కాలర్ ఎగరేసా. అది ఒక సినిమాతో అయ్యేది కాదు. జర్నీలో జయాపజయాలు భాగమే.

చోర్ బజార్ సినిమాలో ఒక కొత్త ప్రపంచం చూస్తారు. జీవన్ రెడ్డి పెద్ద సీన్స్ తెరకెక్కిస్తారు. ఒక సీన్ సాయంత్రం ఆరు గంటలకు మొదలు పెడితే రాత్రి మూడయ్యింది. వెబ్ సిరీస్ లలో నటించడం ఇష్టమే కానీ నా మొదటి ప్రాధాన్యం సినిమాకే. సినిమాను థియేటర్ లో చూడాలని కోరుకుంటా. ఎందుకంటే అక్కడే సినిమాకు గౌరవం లభిస్తుంది. నా గత సినిమాలు చూసిన వాళ్లు నా వయసుకు మించిన పాత్రలు చేశానని అన్నారు. ఇక నుంచి అందరికీ నచ్చే సినిమాలే ఎంచుకోవాలని అనుకుంటున్నాను. రెండు మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తా అన్నారు ఆకాష్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి