Samantha: అందాల సమంతకు అదిరిపోయే ఆఫర్.. ఆ బాలీవుడ్ బడా హీరో సినిమాలో ఛాన్స్.?

అందాల భామ సమంత(Samantha) స్పీడ్ పెంచారు. పెళ్లితర్వాత సినిమాలు తగ్గించిన సమంత విడాకుల తర్వాత మంత్రం జోరు పెంచారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి ఆయా సినిమాల షూటింగ్స్ తో బిజీగా మారిపోయారు.

Samantha: అందాల సమంతకు అదిరిపోయే ఆఫర్.. ఆ బాలీవుడ్ బడా హీరో సినిమాలో ఛాన్స్.?
Samantha
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 23, 2022 | 5:53 PM

అందాల భామ సమంత(Samantha) స్పీడ్ పెంచారు. పెళ్లితర్వాత సినిమాలు తగ్గించిన సమంత విడాకుల తర్వాత మంత్రం జోరు పెంచారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి ఆయా సినిమాల షూటింగ్స్ తో బిజీగా మారిపోయారు. ఇప్పటికే తెలుగులో గుణశేఖర్ తెరెక్కేక్కిస్తోన్న శాకుంతలం అనే సినిమా చేస్తున్నారు సామ్. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఈ సినిమాతోపాటు యశోద అనే థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన మూవీలో నటించారు సామ్. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అదేవిదంగా క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఖుషి సినిమాలో సామ్ నటిస్తోన్న విషయం తెలిసిందే. అలాగే తమిళ్ లోనూ సినిమాలు చేస్తున్నారు. వీటితో పాటు రీసెంట్ గా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ లోనూ ఆఫర్లు అందుకుంటున్నారు సమంత.

ఈ క్రమంలోనే బాలీవుడ్ నుంచి ఈ అమ్మడి భారీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. అక్కడి స్టార్ హీరో సరసన సమంత నటించనుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతలుఆ బడా హీరో ఎవరోకాదు. కండల వేరుడు సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్ నటిస్తున్న న్యూ మూవీలో సమంతను హీరోయిన్ గా ననుకుంటున్నారట. సల్మాన్ గతంలో నటించిన నో ఎంట్రీ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. సల్మాన్, అనిల్ కపూర్, ఫర్దీన్ ఖాన్ నటించిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. అయితే ఈ ప్రాజెక్ట్ లో 10 హీరోయిన్స్ ఉండనున్నారట. వీరిలో సమంత, రష్మిక మందన్న, పూజా హెగ్డే, తమన్నా భాటియా ఈ చిత్రంలో భాగమవుతారని వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి పార్ట్ లో బిపాసా బసు, లారా దత్తా, ఈషా డియోల్ , సెలీనా జైట్లీ నటించారు. వీరి ప్లేస్ లోబ్ ఇప్పుడు సమంత, రష్మిక , పూజా హెగ్డే, తమన్నా  నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి