AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chinmayi Sripaada : సరోగసి వార్తల పై సీరియస్ అయిన సింగర్ చిన్మయి.. ఏమన్నదంటే

సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన  అవసరం లేదు. సినిమా విషయాల కాంట్ ఎక్కువ వివాదాలతోనే చిన్మయి కేజ్ తెచ్చుకుంది.

Chinmayi Sripaada : సరోగసి వార్తల పై సీరియస్ అయిన సింగర్ చిన్మయి.. ఏమన్నదంటే
Singer Chinmayi
Rajeev Rayala
|

Updated on: Jun 23, 2022 | 3:47 PM

Share

సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి(Chinmayi Sripaada) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన  అవసరం లేదు. సినిమా విషయాల కాంట్ ఎక్కువ వివాదాలతోనే చిన్మయి కేజ్ తెచ్చుకుంది. సంఘంలో జరిగే ప్రతి అసాంఘిక చ్యర్య పైన చిన్మయి స్పందిస్తూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళ పై జరిగే అకృత్యాలపై చిన్మయి సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ స్పందిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే చిన్మయి నటుడు రాహుల్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రాహుల్, చిన్మయి దంపతులు ఇటీవలే పండంటి కవలలకు జన్మానించారు. ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సినిమా తారలు, అభిమానులు ఈ జంటకు విషెస్ తెలుపుతున్నారు. అయితే కొంతమంది నెటిజన్స్ మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే.

అయితే చిన్మయి గర్భవతి అని ఎవ్వరికి తెలియదు. ఈ నేపథ్యంలో ఆమె సరోగసి ద్వారా పిల్లలకు జన్మనించినదని వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వార్తలపై చిన్మయి స్పందించింది. కొంతమంది నేను సరోగసి ద్వారా పిల్లలను కన్నానని అంటున్నారు. నేను గర్భవతిగా ఉన్నప్పుడు ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేయలేదు. దాంతో ఈ వార్తలు పుట్టుకొచ్చాయి. నేను గర్భవతిని అని కొంతమందికి మాత్రమే తెలుసు. నన్ను నేను కాపాడుకుంటా.. నా వ్యక్తిగత జీవితం, కుటుంబం, సన్నిహితులను బహిర్గతం చేయను. ఇంకా కొంతకాలం వరకు మా పిల్లల ఫోటోలను కూడా నేను సోషల్ మీడియాలో షేర్ చేయను. నాకు సిజేరియన్ చేసే సమయంలో భజన పాటలను పాడాను. త్వరలోనే దాని గురించి అప్డేట్ ఇస్తానని చెప్పుకొచ్చారు చిన్మయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి