AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas-Anushka: ప్రభాస్- అనుష్కల పెళ్లి.. చిందులేసిన అల్లు అర్జున్, రవితేజ.. ఈ వైరల్ వీడియో చూశారా?

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ పెళ్లి చూడాలని అతని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అందులోనూ అనుష్కతో తమ అభిమాన హీరో వివాహం జరిగితే అంతకన్నా ఆనందపడే విషయం మరొకొటి ఉండదని చాలా మంది కోరుకుంటున్నారు. ఇప్పుడు వారి కలను నిజం చేసింది ఏఐ.

Prabhas-Anushka: ప్రభాస్- అనుష్కల పెళ్లి.. చిందులేసిన అల్లు అర్జున్, రవితేజ.. ఈ వైరల్ వీడియో చూశారా?
Prabhas, Anushka
Basha Shek
|

Updated on: Nov 26, 2025 | 7:12 PM

Share

మంచో, చెడో మొత్తానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తోంది. విద్య, వైద్యం.. ఇలా అన్నీ రంగాల్లోనూ ఇప్పుడు కృత్రిమ మేథస్సుదే హవా. ఇప్పుడిది సామాన్యుల జీవితంలో కూడా ఒక భాగమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను తమ ఆలోచనలనకు మరింత పదును పెడుతున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఏఐతో చాలా ప్రయోగాలే జరుగుతున్నాయి. ఈ లోకంలో లేని నటీనటులను కూడా సిల్వర్ స్క్రీన్ పై చూపిస్తున్నారు. ఇక నెటిజన్లు అయితే ఏఐను ఆడేసుకుంటున్నారు. తమకు ఇష్టమొచ్చిన పనులకు ఈ టెక్నాలజీని వాడేస్తున్నారు. హీరోలు, హీరోయిన్ల ఫొటోలు, వీడియోలను ఎడిట్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇదే క్రమంలో తమకు నచ్చిన హీరో, హీరోయిన్లకు ఏఐ టెక్నాలజీ సహాయంతో పెళ్లిళ్లు కూడా చేసేస్తున్నారు. గతంలో ఇదే టెక్నాలజీ ఉపయోగించిని ప్రభాస్‌- అనుష్కలకు పెళ్లి చేశారు. వాళ్లకు పిల్లలు పుడితే వాళ్లు ఎలా ఉంటారనేది చూపించారు. ఆ ఫొటోలు కూడా నెట్టింట బాగా వైరల్‌ అయ్యాయి. వీటిని చూసిన చాలా మంది ఇది నిజమైతే బాగుండనుకున్నారు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో మరోసారి ప్రభాస్‌-అనుష్కలకు పెళ్లి జరిపించారు. అంతేకాదు ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలంతా హాజరైనట్లు చూపించారు.

ప్రస్తుతం నెట్టింట వైరలవుతోన్న ఈ వీడియోలో ప్రభాస్ అనుష్కల పెళ్లిలో టాలీవుడ్ స్టార్ హీరోలంతా కనిపించారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, అల్లు అర్జున్, రవితేజ, నాని, హీరోయిన్లు కాజల్ అగర్వాల్, తమన్నా, సమంతా.. ఇలా చాలామంది సందడి చేశారు. ఈ సందర్భంగా మహేశ్‌ బాబు, వెంకటేశ్‌ పంచ కట్టుతో పెళ్లికి హాజరయ్యారు. నాగార్జున-నాని సన్నాయి వాయించగా.. అల్లు అర్జున్‌, రవితేజ డ్యాన్సులేశారు. ఇక రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ వంటలు చేయగా, గోపిచంద్‌ అతిథులకు భోజనాలు వడ్డిస్తూ కనిపించాడు. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ బంతి భోజనం లో చిరునవ్వులు చిందించారు. కాజల్‌, తమన్నా పెళ్లి మండపంలో డ్యాన్స్‌ చేయగా, బాలయ్య డప్పు కొడుతూ సందడి చేశారు. ‘ప్రభాస్‌-అనుష్కల పెళ్లి ..అందరూ ఆహ్వానితులే’ అంటూ ఓ నెటిజన్‌ పోస్ట్‌ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీనిని చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఇది నిజమైతే ఎంత బాగుండు అని కామెంట్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరలవుతోన్న ఏఐ వీడియో ఇదిగో..

1685051,1685045,1681114,1684916మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us