MixUp: ప్రేమపై కామం గెలుస్తుందా..? ఆసక్తి రేపుతోన్న మిక్స్‌అప్ ట్రైలర్
సాంప్రదాయక భావాలను సవాలు చేసేలా ఆధునిక సంబంధాల్లోని సానిహిత్యం, ప్రేమ వంటి అంశాలతో మిక్స్ అప్ రూపొంది, అందరినీ ఆలోచింపచేసేలా ఒరిజినల్ తెరకెక్కిందని ట్రైలర్‌ను చూస్తుంటే అర్థమవుతుంది. ఇందులో నిక్కీ అనే పాత్రలో అక్షర గౌడ నటించింది. ఆమెకు అభితో ఉన్న అనుబంధం..

అందాల భామ అక్షర గౌడ్ నటించిన మిక్స్ అప్ విడుదలకు రెడీ అయ్యింది. ఆహా ఒరిజినల్ ‘మిక్స్ అప్’ మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ ఒరిజినల్ ట్రైలర్‌ను ఆహా విడుదల చేసింది. సాంప్రదాయక భావాలను సవాలు చేసేలా ఆధునిక సంబంధాల్లోని సానిహిత్యం, ప్రేమ వంటి అంశాలతో మిక్స్ అప్ రూపొంది, అందరినీ ఆలోచింపచేసేలా ఒరిజినల్ తెరకెక్కిందని ట్రైలర్‌ను చూస్తుంటే అర్థమవుతుంది. ఇందులో నిక్కీ అనే పాత్రలో అక్షర గౌడ నటించింది. ఆమెకు అభితో ఉన్న అనుబంధం.. ఆమె లైంగిక జీవితంలోని సంక్లిష్టతలను ఎలా ఉండబోతున్నాయి.. ప్రేమపై కామం గెలుస్తుందా అని ధైర్యంగా ప్రశ్నించేలా కథనం ఉంటుందని అర్థమవుతుంది. కామం ప్రేమను గెలుస్తుందా.? అనేది దీని ట్యాగ్ లైన్.
కామం, ప్రేమ, ఇద్దరి వ్యక్తుల మధ్య ఉండే అనుబంధం వంటి అంశాలను ఇది తెలియజేసేలా ఉంది. కమల్ కామరాజు, అక్షర గౌడ్ నటన ఎంతో ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌లోని సన్నివేశాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. అక్షర గౌడ తనదైన అందంతో ఆకట్టుకోగా, కమల్ కామరాజు చక్కటి నటనతో మెప్పించారని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది. ప్రధాన కథాంశంతో పాటు, ‘మిక్స్-అప్స అందులోని ఇతర పాత్రల జీవితాలను కూడా తెలియజేస్తోంది.
ఆదర్శ్ బాలకృష్ణ పోషించిన సాహో పాత్ర, అలాగే పూజా ఝవేరి చేసిన మైథిలి పాత్రల మధ్య ఉండే సాన్నిహిత్యం, సంబంధాలలను తెలియజేస్తూనే వారికి ఎదురైన సవాళ్లను వారెలా ఎదుర్కొన్నారనేది ఇందులో చూపించనున్నారు. వివిధ పాత్రల మధ్య ఉండే బావోద్వేగాలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతుంది. నేటి ప్రపంచంలోని మానవ సంబంధాలకు సంబంధించి ఇదొక సరికొత్త అనుభవాన్నిస్తుందని అర్థమవుతుంది. మిక్స్ అప్ ఒరిజినల్‌ను ఆకాష్ బిక్కి తెరకెక్కించారు. ధైర్యంగా, నేటికాలంలో మానవ సంబంధాలపై తను చెప్పాలనుకున్న విషయాలను స్క్రీన్‌పై చక్కగా చూపించారు. ఆలోచింపచేసే కథ, కథనం, మంచి నటనతో తెరకెక్కిన ఈ ఒరిజినల్ గురించి తప్పకుండా అందరూ మాట్లాడుకుంటారనటంలో సందేహం లేదు.
మిక్స్ అప్ ట్రైలర్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



