Chiranjeevi: ఆ సినిమా విషయంలో రిస్క్ తీసుకుంటున్న చిరంజీవి..
విశ్వంభర బడ్జెట్ అనుకున్న దానికంటే భారీగా పెరుగుతుందా..? చిరంజీవి మార్కెట్‌ను వశిష్ట సినిమా సవాల్ చేస్తుందా..? సైరాతో ఓ సారి భారీ బడ్జెట్ సినిమా చేసి.. అంచనాలు అందుకోలేకపోయిన మెగాస్టార్‌ను విశ్వంభర బడ్జెట్ కంగారు పెడుతుందా..? 200 కోట్లు చిరంజీవిపై వర్కవుట్ చేయడానికి మేకర్స్ ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. బాహుబలి వచ్చాక మన నిర్మాతలు బడ్జెట్ గురించి ఆలోచించడం మానేసారు.
Updated on: Mar 08, 2024 | 7:30 PM

విశ్వంభర బడ్జెట్ అనుకున్న దానికంటే భారీగా పెరుగుతుందా..? చిరంజీవి మార్కెట్‌ను వశిష్ట సినిమా సవాల్ చేస్తుందా..? సైరాతో ఓ సారి భారీ బడ్జెట్ సినిమా చేసి.. అంచనాలు అందుకోలేకపోయిన మెగాస్టార్‌ను విశ్వంభర బడ్జెట్ కంగారు పెడుతుందా..? 200 కోట్లు చిరంజీవిపై వర్కవుట్ చేయడానికి మేకర్స్ ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

బాహుబలి వచ్చాక మన నిర్మాతలు బడ్జెట్ గురించి ఆలోచించడం మానేసారు.. కేజియఫ్, ట్రిపుల్ ఆర్ సంచలనాలు చూసాక వద్దన్నా వందల కోట్లు పెడుతున్నారు. అదేమంటే హీరోలకు మార్కెట్ ఉన్నా లేకపోయినా.. పాన్ ఇండియా మార్కెట్ ఉందిగా అంటున్నారు. హనుమాన్, కార్తికేయ 2, పుష్ప సినిమాలకు ఇలాగే పాన్ ఇండియన్ మార్కెట్ వర్కవుట్ అయింది.

మీడియం రేంజ్ హీరోలకే వర్కవుట్ అయిన మార్కెట్.. తనకు కలిసిరాదా అనే ధైర్యంతోనే విశ్వంభర లాంటి భారీ సినిమా చేస్తున్నారు మెగాస్టార్. గతంలో సైరాతో ఓసారి ఇలాంటి ప్రయత్నమే చేసినా వర్కవుట్ అవ్వలేదు. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు సురేందర్ రెడ్డి. కానీ తెలుగులో మినహా.. మిగిలిన చోట్ల సైరా నరసింహారెడ్డి మెప్పించలేదు.

సైరా తర్వాత భారీ బడ్జెట్ సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి.. విశ్వంభరతో మరోసారి ఈ జోన్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మొదట్లో 150 కోట్లు అనుకున్నా.. ప్రాజెక్ట్ పట్టాలెక్కేసరికి 200 కోట్లు అవుతుందని తెలుస్తుంది. త్రిష మెయిన్ హీరోయిన్ కాగా.. సురభి, ఇషా చావ్లా, అశికా రంగనాథ్ లాంటి హీరోయిన్లు చిరంజీవి చెల్లెల్లుగా నటిస్తున్నారు.

200 కోట్ల వరకు బడ్జెట్ అవుతున్నా.. నిర్మాతలు నిశ్చింతగానే ఉన్నారు. దానికి మొదటి కారణం వాళ్ల కంటెంట్‌పై నమ్మకం.. మరోటి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కావడం. పైగా సోషియో ఫాంటసీ సినిమాలకు పెద్ద పీట వేస్తున్నారు నార్త్ ఆడియన్స్. విశ్వంభరను ముందుకు నడిపించేది ఈ నమ్మకమే. జనవరి 10, 2025న విడుదల కానుంది ఈ చిత్రం. సంక్రాంతి సీజన్ కావడం విశ్వంభరకు మరో అడ్వాంటేజ్.




