AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్’ సినిమాకు సీక్వెల్‏కు రంగం సిద్ధం.. ఘనంగా పూజా కార్యకమాలు.. కానీ హీరో మాత్రం..

విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నేచురల్ స్టార్ నాని నిర్మించిన చిత్రం 'హిట్'. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‏గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

క్రైమ్ థ్రిల్లర్ 'హిట్' సినిమాకు సీక్వెల్‏కు రంగం సిద్ధం.. ఘనంగా పూజా కార్యకమాలు..  కానీ హీరో మాత్రం..
Adivi Sesh
Rajitha Chanti
|

Updated on: Mar 20, 2021 | 3:22 PM

Share

విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నేచురల్ స్టార్ నాని నిర్మించిన చిత్రం ‘హిట్’. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‏గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమా విజయం తర్వాత దీనికి సీక్వెల్ ఉంటుందని గతంలోనే ప్రకటించారు మేకర్స్. శనివారం ‘హిట్ 2’ మూవీ  పూజా కార్యక్రమాలు జరుపుకోని లాంఛానంగా ప్రారంభించారు చిత్రయూనిట్. అయితే ఈ సారి మాత్రం  ఇందులో హీరో మారాడు. విశ్వక్ సేన్‌కు బదులుగా టాలెంటెడ్ హీరో అడవి శేష్ నటిస్తున్నాడు. హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలు జరుపుకున్న తర్వాత నేచురల్ స్టార్ నాని క్లాప్ కొట్టి ఈ సినిమాను ఆరంభించాడు.

ఈ సినిమాకు కూడా మళ్లీ శైలేష్‌ కొలను దర్శకత్వం వహించనున్నాడు. మణికందన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి సంగీతాన్ని అందించనున్నాడు. హీరోయిన్స్‌గా మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ కనిపించనున్నారు. ‘ది సెకండ్‌ కేస్‌’ అనేది సినిమా ట్యాగ్‌లైన్‌. ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం అడివి శేష్.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు నిర్మాణంలో మేజ‌ర్‌ చేస్తున్నాడు. 26/11 ముంబాయి తీవ్రవాద దాడుల్లో వీర‌మ‌ర‌ణం పొందిన మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. గూఢ‌చారి,ఫేమ్ శ‌శి కిర‌ణ్ తిక్కా ఈ సిన‌మాల‌ను తెర‌కెక్కిస్తున్నారు. సోనీ పిక్చ‌ర్స్‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు జీఎంబీ ఎంట‌ర్‌టైన్ మెంట్‌, ఏప్ల‌స్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కానుంది. తెలుగు అమ్మాయి శోభితా ధూళిపాళ్ల‌, బాలీవుడ్ బ్యూటీ సైయీం మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Also Read:

అమెరికాలో హల్‏చల్ చేస్తున్న ‘జాతి రత్నాలు’.. ఆ టైంకు కలుద్ధామంటూ వీడియో షేర్ చేసిన జోగిపేట బాయ్స్..

Vakeel Saab Movie: దుండిగల్ MLRIT కాలేజీలో ‘వకీల్ సాబ్’ మ్యూజిక్ ఫెస్ట్.. మధ్యాహ్నం 2 గంటలకు..

సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!