Sai Pallavi : సమ్మర్ స్పెషల్ గా సాయిపల్లవి .. రెండు సినిమాలతో పలకరించనున్న ఫిదా బ్యూటీ

సాయి పల్లవి ఇప్పుడు ఈ పేరు కు టాలీవుడ్ లో యమా క్రేజ్ ఉంది. సాయి పల్లవి కోసం యంగ్ హీరోలు, డైరెక్టర్లు కాచుకొని కూర్చున్నారు. సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన

Sai Pallavi : సమ్మర్ స్పెషల్ గా సాయిపల్లవి .. రెండు సినిమాలతో పలకరించనున్న ఫిదా బ్యూటీ
Sai Pallavi
Follow us

|

Updated on: Mar 20, 2021 | 5:06 PM

Sai Pallavi : సాయి పల్లవి ఇప్పుడు ఈ పేరు కు టాలీవుడ్ లో యమా క్రేజ్ ఉంది. సాయి పల్లవి కోసం యంగ్ హీరోలు, డైరెక్టర్లు కాచుకొని కూర్చున్నారు. సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ కుందనపు బొమ్మ. మొదటి సినిమా తోనే తన నటన అభినయం తో అందరిని ఆకట్టుకుంది. ఇక సాయి పల్లవి తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. చూడటానికి పదహారణాల తెలుగు యువతిగా కనిపించే పల్లవికి ఫిదా తర్వాత ఆఫర్లు వెల్లువెత్తాయి. గ్లామర్ పాత్రలకు కాకూండా నటనకు ప్రాధాన్యత కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ. ఇక ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించనుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తున్న లవ్ స్టోరీ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు. అందమైన ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు శేఖర్ కమ్ముల. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. అలాగే సారంగదారియా అనే పాట ప్రస్తుతం ట్రేండింగ్ లో కొనసాగుతుంది. ఈ పాట యూట్యూబ్ సంచలనం సృష్టిస్తుంది. మరో వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాటపర్వం అనే సినిమా చేస్తుంది సాయిపల్లవి ఈ సినిమాలో రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్నాడు. విభిన్నమైన కథతో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలా రెండు సినిమాలతో ఈ ఏడాది సాయిపల్లవి అలరించనుంది. ఈ రెండు సినిమాలు ఎలాంటి విజయాలు సాదిస్తాయో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి: 

Jathi Ratnalu: బాహుబలి సినిమా కలెక్షన్స్ ను బీట్ చేసిన జాతిరత్నాలు.. ఎంత వసూల్ చేసిందటే

Deepika Pilli : గుడిలో డ్యాన్స్ లు చేసిన టిక్ టాక్ స్టార్… ఇదేంపనంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..