Vishnu Priya: ‘పృథ్వి వేరే అమ్మాయితో వెళ్లిపోతే’.. రిలేషన్ షిప్‌పై ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ
గత సీజన్ బిగ్ బాస్ సీజన్ లో పాల్గొన్నప్పుడు ప్రముఖ బుల్లితెర నటుడు పృథ్వీతో బాగా క్లోజ్ అయింది విష్ణు ప్రియ. హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా ఇద్దరూ కలిసే కనిపిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విష్ణు ప్రియ తన రిలేషన్ షిప్ పై క్లారిటీ ఇచ్చింది.

యాంకర్ గా, నటిగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది విష్ణుప్రియ. ప్రస్తుతం కూడా టీవీ షోస్, ప్రోగ్సామ్ తో బిజి బిజీగా ఉంటోంది. ముఖ్యంగా గతేడాది బిగ్ బాస్ సీజన్ తర్వాత ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ వంటి టీవీ షోస్ లో మెరుస్తోన్న ఈ ముద్దుగుమ్మ లవ్, డేటింగ్, రిలేషన్ షిప్ విషయాలతోనూ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా సీరియల్ నటుడు పృథ్వీతో ఈ అమ్మడు పీకల్లోతు ప్రేమలో ఉందని తెలుస్తోంది.గత బిగ్ బాస్ లో పాల్గొన్నప్పటి నుంచి వీరిద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. ఇద్దరూ కలిసే గేమ్ ఆడారన్న అభిప్రాయాలు వ్యక్తమవయ్యాయి. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా జంటగానే కనిపిస్తున్నారీ లవ్ బర్డ్స్. సందర్భమొచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరు ప్రేమను కురిపిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విష్ణు ప్రియ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే పృథ్వీతో రిలేషన్ షిప్ పై ఓపెన్ గా మాట్లాడేసింది.
‘పృథ్వీ నాకు మంచి ఫ్రెండ్ అంతే. అయితే అతనితో మంచి బాండింగ్ ఉంది. పృథ్వీ పక్కన ఉంటే నేను హ్యాపీగానే ఉంటాను. పృథ్వీ కోసమే కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ టీవీ షోకు మళ్లీ వచ్చాను. ఇప్పుడైతే హ్యాపీగానే ఉన్నాం. ఒకవేళ అతను లవ్ అనే టాపిక్ తో వస్తే అప్పుడు ఆలోచిస్తాను. అది జరిగినా ఓకే. జరగకపోయినా ఓకే. ఒకవేళ పృథ్వి వేరే అమ్మాయితో వెళ్లిపోయినా నాకు ఒకే. మొదట్లో పాత రిలేషన్ షిప్ లో కొన్ని తప్పులు జరిగాయి. కాబట్టి ఇప్పుడు కూల్ గా ఆలోచిస్తున్నాను. ప్రస్తుతానికైతే నేను సింగిల్ గానే ఉన్నాను. అలాగే మింగిల్ అవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను. నా వైబ్రేషన్ ఉన్న అబ్బాయి దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. అలాగే పృథ్వీ ప్రపోజ్ చేస్తే మాత్రం ఓకే చెప్తాను’ ఓపెన్ గా చెప్పేసింది విష్ణుప్రియ. ప్రస్తుతం ఈ నటి కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై పృథ్వీ ఎలా స్పందిస్తాడో చూడాలి.
విష్ణు ప్రియ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








