AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JD chakravarthy: జేడీ చక్రవర్తి ఆ టాలీవుడ్‌ యాంకర్‌తో ప్రేమలో ఉన్నారా.? త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారా.?

సినిమా ఇండస్ట్రీలో గాసిప్స్‌కు కొదవే ఉండదు. ఇదిగో తోక అంటే.. అదిగో పులి అంటుంటారు. ముఖ్యంగా సినీ తారల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి వార్తలకే కొదవే ఉండదు. నిత్యం ఏదో ఒక గాసిప్‌ వైరల్‌ అవుతూనే ఉంటుంది. సోషల్‌ మీడియాలో విస్తృతి పెరిగిన తర్వాత ఈ ధోరణి మరింత పెరిగింది. అయితే తారలు ఎలాంటి స్టేట్‌మెంట్...

JD chakravarthy: జేడీ చక్రవర్తి ఆ టాలీవుడ్‌ యాంకర్‌తో ప్రేమలో ఉన్నారా.? త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారా.?
Jd Chakravarthy
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 18, 2023 | 8:44 AM

సినిమా ఇండస్ట్రీలో గాసిప్స్‌కు కొదవే ఉండదు. ఇదిగో తోక అంటే.. అదిగో పులి అంటుంటారు. ముఖ్యంగా సినీ తారల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి వార్తలకే కొదవే ఉండదు. నిత్యం ఏదో ఒక గాసిప్‌ వైరల్‌ అవుతూనే ఉంటుంది. సోషల్‌ మీడియాలో విస్తృతి పెరిగిన తర్వాత ఈ ధోరణి మరింత పెరిగింది. అయితే తారలు ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వకపోతేనే పుకార్లకు కొదవ ఉండదు. అలాంటిది వారే స్వయంగా ప్రకటన చేస్తే ఇంకేముంది రచ్చ మాములుగా ఉండదు. తాజాగా అలాంటి రచ్చకే తెర తీసింది అందాల తార విష్ణుప్రియ.

యాంకర్‌గా కెరీర్‌ మొదలు పెట్టి యాక్టర్‌గా మారిన విష్ణుప్రియకు యూత్‌లో ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసిందంటే చాలు లైక్‌ల వర్షం కురవాల్సిందే. తాజాగా ఈ చిన్నది చేసిన కొన్ని వ్యాఖ్యలు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విష్ణుప్రియ తనకు జేడీ చక్రవరి అంటే ఇష్టమని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అక్కడితే ఆగకుండా అవకాశం వస్తే అతన్ని పెళ్లి చేసుకుంటానని కూడా స్టేట్‌మెంట్ ఇచ్చేసింది. దీంతో ఈ వ్యాఖ్యలు తెగ వైరల్‌ అయ్యాయి. ఇదిలా ఉంటే విష్ణుప్రియ చేసిన వ్యాఖ్యలపై జేడీ చక్రవరి అధికారికంగా స్పందించారు.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించిన జేడీ మాట్లాడుతూ.. తమ మధ్య మంచి అనుబంధం ఉందని, అది ప్రేమకాదని చెప్పుకొచ్చారు. విష్ణుప్రియతో కలిసి వెబ్‌ సిరీస్‌లో నటించిన సమయంలో జరిగిన సంఘటనను పంచుకున్నారు. ఈ విషయమై జేడీ మాట్లాడుతూ.. ‘వెబ్‌ సిరీస్‌ కోసం నేను, ప్రియ 40 రోజులు కలిసి పనిచేశాం. ఆ సిరీస్‌ దర్శకుడు పవన్‌ సాధినేని ప్రతిరోజూ నేను నటించిన ఒక సినిమా చూడమని విష్ణుప్రియకు చెప్పాడు. దీంతో ఆయా చిత్రాల్లోని పాత్రలతో ఆమె ప్రేమలో పడ్డారు. అంతే తప్ప ఆమె నన్ను ప్రేమించలేదు. మా మధ్య గురు శిష్యుల అనుబంధమే ఉంది. చాలా తక్కువగా మాట్లాడుకుంటాం’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

Vishnu Priya Jd

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..