AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాయం చేసి వేధిస్తున్నాడు: నటుడిపై నటి ఫిర్యాదు

తీవ్ర అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కన్నడ నటి విజయలక్ష్మీ ప్రస్తుతం కోలుకుంటోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆమెకు సాయం చేసేందుకు పలువురు ముందుకు రావడంతో మెరుగైన వైద్యాన్ని చేయించుకుంటోంది. అయితే నటుడు రవిప్రకాశ్ తనను మానసికంగా వేధిస్తున్నాడని పుట్టేనహళ్లి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన దగ్గరకు ఫిబ్రవరి 27న రవిప్రకాశ్ వచ్చి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేశాడని, ఆ తరువాత ప్రతి రోజు ఐసీయూకు […]

సాయం చేసి వేధిస్తున్నాడు: నటుడిపై నటి ఫిర్యాదు
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 11, 2019 | 1:14 PM

Share

తీవ్ర అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కన్నడ నటి విజయలక్ష్మీ ప్రస్తుతం కోలుకుంటోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆమెకు సాయం చేసేందుకు పలువురు ముందుకు రావడంతో మెరుగైన వైద్యాన్ని చేయించుకుంటోంది. అయితే నటుడు రవిప్రకాశ్ తనను మానసికంగా వేధిస్తున్నాడని పుట్టేనహళ్లి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన దగ్గరకు ఫిబ్రవరి 27న రవిప్రకాశ్ వచ్చి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేశాడని, ఆ తరువాత ప్రతి రోజు ఐసీయూకు రావడం, పదేపదే ఫోన్ మెసేజ్‌లు చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, వైరల్‌గా మారింది.

Follow Us