AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: దెయ్యాలతో వీడియోలు చేసి.. ఓటీటీని ఊపేస్తోన్నకన్నడ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

వీకెండ్ లో మంచి హారర్ థ్రిల్లర్ సినిమా కానీ, వెబ్ సిరీస్ కానీ చూడాలనుకుంటున్నారా? అయితే ఈ మూవీ మీకు బెస్ట్ ఆప్షన్. ప్రస్తుతం ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో ఉన్న ఈ మూవీ చూస్తున్నంత సేపు ఆడియెన్స్ కు చెమటలు పట్టిస్తోంది.

OTT Movie: దెయ్యాలతో వీడియోలు చేసి.. ఓటీటీని ఊపేస్తోన్నకన్నడ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Jun 18, 2026 | 8:22 PM

Share

ఎప్పటిలాగే ఈ వారం ఓటీటీల్లో పలు సినిమాలు రానున్నాయి. ఇప్పటికే మోహన్ లాల్ దృశ్యం 3, యోగిబాబు కేనతా కానం వంటి సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. అలాగే సేవ్ ద టైగర్స్ సీజన్ 3 వెబ్ సిరీస్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇక శుక్రవారం ( జూన్ 18) రేజర్, అతిరథి, ఎమ్4ఎమ్ వంటి మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. అయితే వీటి మధ్య ఒక హారర్ థ్రిల్లర్ మూవీ గురించి ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇదొక కన్నడ హారర్ థ్రిల్లర్ మూవీ. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలై ఆడియెన్స్ ను తెగ భయ పెట్టింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకూ ఈ సినిమాలో థ్రిల్లింగ్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. అందుకు తగ్గట్టే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పటికీ ఐఎమ్ డీబీలోనూ ఈ మూవీకి 8.2 రేటింగ్ ఉండడం విశేషం. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. వైరల్ కంటెంట్‌తో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఫేమస్ అవ్వాలని ఆశపడతాడు హీరో సిద్దు. అయితే అతను ఎంత ప్రయత్నించినా అతని వీడియోలకు వ్యూస్ రావు. దీంతో దెయ్యాలకు సంబంధించిన కంటెంట్ చేస్తే క్రేజ్ ఉంటుందని అలాంటి వీడియోలు ట్రై చేస్తాడు. అలా ఓ దెయ్యం కంటెంట్ వీడియో కోసం ప్లాన్ చేసి అనుకోకుండా ఓ రహస్య ప్రదేశంలో చిక్కుకుంటాడు సిద్దు. అక్కడ అతనికి చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. మరి అక్కడి నుంచి సిద్ధూ ప్రాణాలతో బయటపడ్డాడా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్రస్తుతం ఓటీటీ ఆడియెన్స ను బాగా భయపెడుతోన్న ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు సీట్ ఎడ్జ్. చేతన్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమాలో సిద్దు మూలిమణి, రవిక్షా శెట్టి, రఘు రమణకొప్ప, గిరీష్ శివన్న తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఎన్ ఆర్ సినిమా ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ వెర్షన్ కన్నడతో పాటు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. వీకెండ్ లో మంచి హారర్ థ్రిల్లింగ్ కంటెంట్ తో ఉన్న సినిమా కానీ, వెబ్ సిరీస్ కానీ చూడాలనుకునేవారికి సీట్ ఎడ్జ్ మూవీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us