AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trinetra Haldar: అందంగా కనిపించేందుకు ముఖానికి సర్జరీ చేసుకున్న యువనటి.. ఫోటోస్ వైరల్..

ప్రస్తుతం ఆ యువనటి షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. తనే బాలీవుడ్ నటి త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు. భారతదేశంలో మొదటి ట్రాన్స్‏జెండర్ యూట్యూబర్. తెలుగు, బెంగాలీకీ కుటుంబానికి చెందిన త్రినేత్ర.. 20 ఏళ్ల వరకు అబ్బాయిలానే జీవించింది. డాక్టర్ కావాలనుకుని ఎంబీబీఎస్ చదువుతున్న సమయంలోనే తనలో అమ్మాయి లక్షణాలు ఉన్నాయని గ్రహించి 2018లో ట్రాన్స్ జెండర్ గా మారింది. ఆమెకు కుటుంబసభ్యులు కూడా అండగా నిలిచారు.

Trinetra Haldar: అందంగా కనిపించేందుకు ముఖానికి సర్జరీ చేసుకున్న యువనటి.. ఫోటోస్ వైరల్..
Trinetra Haldar
Rajitha Chanti
|

Updated on: May 12, 2024 | 6:17 AM

Share

సాధారణంగా అందంగా కనిపించేందుకు నటీనటులు ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవడం ఇండస్ట్రీలో కామన్. చాలా మంది నటీనటులు ఈ సర్జరీ చేయించుకున్నట్లు బహిరంగంగానే చెప్పేస్తారు. ఇటీవల కొందరు తారలు తమ సర్జరీ గురించి అసలు బయటకు చెప్పరు. అలాగే తమ సర్జరీ గురించే వార్తలపై గట్టిగానే రియాక్ట్ అవుతారు. కానీ ఇప్పుడు ఓ యువనటి మరింత అందంగా కనిపించేందుకు ముఖానికి సర్జరీ చేసుకున్నానని చెప్పింది. అంతేకాదు.. తన సర్జరీ ఫోటోను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఆ యువనటి షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. తనే బాలీవుడ్ నటి త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు. భారతదేశంలో మొదటి ట్రాన్స్‏జెండర్ యూట్యూబర్. తెలుగు, బెంగాలీకీ కుటుంబానికి చెందిన త్రినేత్ర.. 20 ఏళ్ల వరకు అబ్బాయిలానే జీవించింది. డాక్టర్ కావాలనుకుని ఎంబీబీఎస్ చదువుతున్న సమయంలోనే తనలో అమ్మాయి లక్షణాలు ఉన్నాయని గ్రహించి 2018లో ట్రాన్స్ జెండర్ గా మారింది. ఆమెకు కుటుంబసభ్యులు కూడా అండగా నిలిచారు.

అటు డాక్టర్ పూర్తిచేసిన త్రినేత్ర.. ఇటు నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. యూట్యూబ్ ఛానల్ ద్వారా తనలాంటి ట్రాన్స్ జెండర్స్ కు అవగాహన కల్పిస్తూ వీడియోస్ రిలీజ్ చేసింది. ఇటీవలే మేడ్ ఇన్ హెవన్ వెబ్ సిరీస్ రెండవ సీజన్ తో నటిగా ప్రయాణం మొదలుపెట్టింది. అలాగె రెయిన్ బో రిస్తా అనే మరో సిరీస్ లో నటించింది. 26 ఏళ్ల త్రినేత్ర సోషల్ మీడియా ద్వారా ట్రాన్స్ జెండర్ సమస్యలపై అవగాహన కల్పిస్తోంది. అయితే ఇటీవలే తాను ముఖానికీ ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన సర్జరీ ఫోటోను షేర్ చేసింది.

“నా మార్పు పూర్తయింది. ఈ చివరిదశ ఎప్పుడైనా జరుగుతుందని నేను అనుకోలేదు. కానీ ఇది జరిగింది. నేను ఇది కేవలం నాకోసమే చేశాను. కానీ ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను.” అంటూ సుధీర్ఘ నోట్ రాసుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us