
మరికొంది సేపట్లో బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభంకానుంది. సీజన్ 9కోసం ప్రేక్షకులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ గేమ్ షో ఇప్పటికే ఎనిమిది సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 9కు రంగం సిద్ధమైంది. ఈసారి సెలబ్రెటీలతో పాటు సామాన్యులు కూడా చాలా మంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లనున్నారు. నేడు (ఆదివారం) బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభంకానుంది. తెలుగు ఆడియన్స్ సీజన్ 9కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సామాన్యుల కోసం అగ్నిపరీక్ష అనే షో పెట్టి కొంతమందిని ఫిల్టర్ చేశారు. సామాన్యుల కోటాలో నాగ ప్రశాంత్, మనీష్ మర్యాద, మాస్క్ మ్యాన్ హరీష్, పవన్ కళ్యాణ్, శ్రీజ దమ్ము, ప్రియా శెట్టి, దివ్య నిఖిత ఇలా కొందరు అడుగుపెట్టనున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లోక్ అడుగుపెట్టడంతో తన కెరీర్ క్లోజ్ అయ్యిందని ఓ అందాల భామ చెప్పి షాక్ ఇచ్చింది. ఇంతకూ ఆమె ఎవరంటే..
ఆమె మరెవరో కాదు సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఫెమస్ అయిన తేజస్వి మాదివాడ. ఆర్జీవీ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ సినిమాలో సోలో హీరోయిన్ గా నటించినా, ఆ తర్వాత సెకెండ్ ఫీమెల్ లీడ్, క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ఎక్కువగా కనిపించింది.బిగ్ బాస్ హౌజ్ లో అడుగు పెట్టి బుల్లితెర ఆడియెన్స్ కు చేరువైన తేజస్వి మదివాడ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 లో పాల్గొంది ఈ అమ్మడు. తన ఆటతో ప్రేక్షకులను అలరించింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మడు సినిమాల్లో బిజీ అవుతుందని అంతా అనుకున్నారు.. కానీ అలా జరగలేదు.
ప్రస్తుతం ఈ అమ్మడు కూడా సోషల్ మీడియాలో ఫోటోలు, రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాలా మంది బిగ్ బాస్ లోకి వెళ్లాలని ఆరాటపడుతున్నారు.. అక్కడ జరిగేది ఒకటి మనకు చూపించేది మరొకటి. బిగ్ బాస్ చూసిన జనాలు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. మా గురించి పిచ్చుపిచ్చిగా మాట్లాడుకుంటుంటారు.. చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తారు. దాంతో దర్శకనిర్మాతలు మాకు ఛాన్స్ లు ఇవ్వడానికి వెనకడుతారు. బిగ్ బాస్ గేమ్ షోలో పాల్గొనడం వల్లే నా కెరీర్ నాశనం అయ్యింది అని తెలిపింది తేజస్వి. ఇక బిగ్ బాస్ లోకి వెళ్లే గురించి మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే ఫెమస్ అవ్వడమేమో కానీ ఉన్న ఫేమ్ పోతుంది అని తేజస్వి చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.