Tamannaah: అప్పుడు నన్ను రిజక్ట్ చేశారు.. ఇప్పుడు వాళ్లతోనే కలిసి నటిస్తున్నా.. షాకింగ్ విషయం చెప్పిన తమన్నా
తెలుగులో సినిమాలు తగ్గించిన తమన్నా.. బాలీవుడ్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. తాజాగా ఈ అమ్మడు ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్నీ తెలిపింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈవెంట్ మార్చి 19న జరిగింది. రాబోయే సిరీస్, సినిమాల లిస్ట్ కూడా విడుదల చేశారు. 'మీర్జాపూర్ 3', పంచాయత్ 3' సహా అనేక సిరీస్ లు, సినిమాలు అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి.

టాలీవుడ్ లో ఒకప్పుడు తన సత్తా చాటి స్టార్ హీరోయిన్ గా రాణించింది తమన్నా.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది తమన్నా.. ఈ బ్యూటీకి భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ మధ్య కాలంలో బోల్డ్ రోల్స్ ఎంచుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది మిల్కి బ్యూటీ. తెలుగులో సినిమాలు తగ్గించిన తమన్నా.. బాలీవుడ్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. తాజాగా ఈ అమ్మడు ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్నీ తెలిపింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈవెంట్ మార్చి 19న జరిగింది. రాబోయే సిరీస్, సినిమాల లిస్ట్ కూడా విడుదల చేశారు. ‘మీర్జాపూర్ 3′, పంచాయత్ 3’ సహా అనేక సిరీస్ లు, సినిమాలు అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి. అదే విధంగా, తమన్నా కొత్త సిరీస్ కూడా రానుంది.
ఈ సిరీస్ కు ‘డేరింగ్ పార్టనర్స్’ అనే పేరు ఖరారు చేశారు. డయానా, జావేద్ జాఫ్రీ కూడా ఈ సిరీస్ లో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే తమన్నా తాజాగా ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. చిన్న వయసులోనే తనను రిజెక్ట్ చేసిన వారితో సినిమా చేసే అవకాశం వచ్చిందని తెలిపింది తమన్నా. అసలు విషయం ఏంటంటే.. తమన్నా చిన్నతనంలో డ్యాన్స్ రియాలిటీ షో ‘బూగీ వూగీ’ కోసం ఆడిషన్ చేసింది.. కానీ రిజక్ట్ అయ్యిందట.
ఇది నా చిన్ననాటి జ్ఞాపకం. నేను బూగీ వూగీ రియాలిటీ షో నుంచి నేను రిజక్ట్ అయ్యాను. ఇప్పుడు వారితో కలిసి పనిచేస్తున్నాను’ అని తెలిపింది తమన్నా. జావేద్ జాఫ్రీ ఈ మాటలు విని షాక్ అయ్యాడు. తమ రియాలిటీ షో కోసం తమన్నా కూడా ఆడిషన్‌కి వెళ్లిందని అతనికి తెలియదు. ఇక తమన్నా వెబ్ సిరీస్ ‘డేరింగ్ పార్టనర్స్’ ఇద్దరు ప్రాణ స్నేహితుల కథ. ప్రపంచాన్ని పట్టించుకోకుండా మద్యం కంపెనీని ప్రారంభించేందుకు ఇద్దరూ ప్రయత్నిస్తారు. అదే సమయంలో వారు ఎదుర్కొన్న సవాళ్లను ఈ సిరీస్ చూపించారు. కరణ్ జోహార్ ధర్మా ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మించిన ఈ సిరీస్‌కి అర్చిత్ కుమార్, నిశాంత్ నాయక్ దర్శకత్వం వహించనున్నారు. డయానా పెంటీ ‘డేరింగ్ పార్టనర్స్’తో OTT వరల్డ్ లోకి అడుగుపెడుతోంది. ఈ సిరీస్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. తమన్నా నటించిన చాలా సినిమాలు 2023లో విడుదలయ్యాయి. ‘జైలర్’ సినిమాలో స్పెషల్ సాంగ్ తో పాటు చిన్న రోల్ లో నటించింది. ఇక ఈ అమ్మడు నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. ఈ ఏడాదిలోనే వీరి వివాహం జరిగే అవకాశం ఉంది.
తమన్నా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




