ఉదయ్ నిన్ను చాలా మిస్ అవుతున్నా.. గతాన్ని తలుచుకొని ఎమోషనలైన హీరోయిన్
తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఉదయ్ తన నటనతో మెప్పించాడు. ఆతర్వాత మరోసారి తేజ దర్శకత్వలో నువ్వు నేను సినిమా చేశాడు. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అప్పట్లో ఈ సినిమా ఓ ఊపు ఊపేసింది. ముఖ్యంగా యువత ఈ సినిమాను ఎక్కువగా ఆదరించారు. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాలో అనిత ఉదయ్ కు జోడీగా నటించింది.

ఒకప్పుడు లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ హఠాత్తుగా ఈలోకం విడిచివెళ్లిపోయాడు. ఉదయ్ కిరణ్ ఉండిఉంటే ఇప్పుడు స్టార్ హీరో అయ్యుండేవాడు అంటూ ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు. చిత్రం సినిమాతో హీరోగా పరిచయమైన ఉదయ్ కిరణ్.. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఉదయ్ తన నటనతో మెప్పించాడు. ఆతర్వాత మరోసారి తేజ దర్శకత్వలో నువ్వు నేను సినిమా చేశాడు. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అప్పట్లో ఈ సినిమా ఓ ఊపు ఊపేసింది. ముఖ్యంగా యువత ఈ సినిమాను ఎక్కువగా ఆదరించారు. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాలో అనిత ఉదయ్ కు జోడీగా నటించింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 23 ఏళ్ళు అవుతుంది.
ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల హవా నడుస్తున్న క్రమంలో ఇప్పుడు ఈ కల్ట్ క్లాసిక్ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. మార్చ్ 21( గురువారం) నువ్వు నేను సినిమా మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. దాంతో ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. నువ్వు నేను మూవీ రీ రిలీజ్ నేపథ్యంలో మూవీ హీరోయిన్ అనిత పో వీడియోను రిలీజ్ చేసింది.
కొద్దిరోజుల క్రితం అనిత తన సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. అందరికి నమస్కారం, నాకు చాలా సంతోషంగాఉంది. నువ్వు నేను సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. నేను , ఉదయ్ , మా మూవీ టీమ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. సినిమా చాలా పెద్ద విజయం సాధించడం ఆనందాన్నిచ్చింది. మరోసారి నువ్వు నేను సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు. అలాగే ఆమె మాట్లాడుతూ.. ఉదయ్ నేను, నీ ఫ్యాన్ నిన్ను చాలా చాలా మిస్ అవుతున్నాం.. నువ్వు ఇదంతా చూస్తావని అనుకుంటున్నా.. అని చెప్పుకొచ్చారు అనిత.
View this post on Instagram
అనిత ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




