- Telugu News Photo Gallery Cinema photos Cult Movies re releasing again like Magadheera, Bommarillu and Nuvvu Nenu
మళ్లీ విడుదలవుతున్న కల్ట్ సినిమాలు.. అందులో చరణ్ సినిమాలు ఎన్నంటే ??
కలెక్షన్లు రానీ రాకపోనీ.. లాభాలు రానీ రాకపోనీ.. అకేషన్ వచ్చిందంటే మాత్రం అస్సలు తగ్గేదే లే అంటున్నారు నిర్మాతలు. కోరి మరీ పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు.. చూస్తుంటే ఈ ట్రెండ్ ఇప్పట్లో ఆగేలా లేదు. ఈ సీజన్‌లోనే మరో 4 సినిమాలు మళ్లీ విడుదల కానున్నాయి. అందులో చరణ్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. మరి అవేంటి..? రీ రిలీజ్ సినిమాలకు మునపట్లా కలెక్షన్లు రాకపోయినా కూడా నిర్మాతలు మాత్రం వెనక్కి తగ్గేదే లే అంటున్నారు.
Updated on: Mar 20, 2024 | 12:58 PM

కలెక్షన్లు రానీ రాకపోనీ.. లాభాలు రానీ రాకపోనీ.. అకేషన్ వచ్చిందంటే మాత్రం అస్సలు తగ్గేదే లే అంటున్నారు నిర్మాతలు. కోరి మరీ పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు.. చూస్తుంటే ఈ ట్రెండ్ ఇప్పట్లో ఆగేలా లేదు. ఈ సీజన్‌లోనే మరో 4 సినిమాలు మళ్లీ విడుదల కానున్నాయి. అందులో చరణ్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. మరి అవేంటి..?

రీ రిలీజ్ సినిమాలకు మునపట్లా కలెక్షన్లు రాకపోయినా కూడా నిర్మాతలు మాత్రం వెనక్కి తగ్గేదే లే అంటున్నారు. వరసగా పాత సినిమాలను రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మార్చి 21న ఉదయ్ కిరణ్ నువ్వు నేను రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ కూడా వచ్చింది.

అలాగే మార్చి 26 రామ్ చరణ్ మగధీర సినిమాను భారీ ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు. 2009లో రాజమౌళి తెరకెక్కించిన మగధీర అప్పట్లోనే 80 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.

అలాగే నాయక్, ఆరెంజ్ స్పెషల్ షోస్ కూడా ప్లాన్ చేస్తున్నారు అభిమానులు. మరోవైపు విడుదలై 30 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. ప్రభుదేవా క్లాసిక్ బ్లాక్‌బస్టర్ ప్రేమికుడును భారీగానే రీ రిలీజ్ చేయబోతున్నారు. మార్చిలోనే సమరసింహారెడ్డిని రీ రిలీజ్ చేసారు. సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా సమరసింహాన్ని మరోసారి రిలీజ్ చేసారు మేకర్స్.

ఇక ఎప్రిల్ 17న సిద్ధార్థ్ బర్త్ డే కానుకగా బొమ్మరిల్లు రీ రిలీజ్ చేస్తున్నారు. ఎలాగూ కొత్త సినిమాలేవీ లేవు కాబట్టి.. పాత సినిమాలతోనే థియేటర్స్ నింపేయాలని ఫిక్సైపోయారు డిస్ట్రిబ్యూటర్లు. మరి ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా లేదా చూడాలి.




