Balu Jajala |
Updated on: Mar 20, 2024 | 2:21 PM
తమ కొత్త షోలు, రాబోయే చిత్రాలను ఆవిష్కరించడానికి ప్రైమ్ వీడియో నిర్వహించిన గ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్ కోసం సమంత రూత్ ప్రభు ఇటీవల ముంబైకి వచ్చారు. ఈ కార్యక్రమంలో వరుణ్ ధావన్ సరసన సమంత నటించిన తాజా చిత్రం 'సిటాడెల్ త్వరలో విడుదల కాబోతోంది.
తమన్నా, ఆమె ప్రియుడు విజయ్ వర్మ సమంత ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఫ్రెండ్ షిప్ గోల్స్ అంటూ ఆ ఫొటోలను షేర్ చేసింది. మార్చి 19న సమంత తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో తమన్నాతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది.
ఈ ఫోటోను షేర్ చేస్తూ ఓ మై లవ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలో తమన్నాతో పాటు ఆమె ప్రియుడు ఉన్నారు. ఈ ఇద్దరూ బ్యూటీలు నవ్వులు చిందిస్తుండగా విజయ్ వర్మ హ్యాపీగా ఫొటోగ్రాఫర్ గా మారిపోయాడు.
ఒకే ప్రేమ్ లో వీరు ముగ్గరు మెరిసిపోయారు. ఆ తర్వాత విజయ్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో వారిద్దరి కలయికకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గతకొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత మళ్లీ యాక్టివ్ మోడ్ లోకి వచ్చారు. త్వరలోనే ఆమె మరిన్ని సినిమా ప్రాజెక్టులను ఒకే చేసే అవకాశం ఉంది. ఇక ఈ బ్యూటీ పుష్ప2 లో కూడా నటిస్తుందనే టాక్ కూడా వినిపిస్తోంది.