- Telugu News Photo Gallery Business photos Audi Q6 Etron SQ6 Etron New Electric Car Will Run 625 Kilometers On A Single Charge
Audi Electric Car: ఆడి నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి ఛార్జింగ్‌తో 625 కిలోమీటర్లు
ఆడి కొత్త ఎలక్ట్రిక్ కారును మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. ఆడి కొత్త ఎట్రాన్ ఎస్‌యూవీని మార్కెట్లో లాంఛ్ చేసింది కంపెనీ. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రీమియం ప్లాట్‌ఫాం ఎలక్ట్రిక్ ఆర్కిటెక్చర్‌పై తయారు చేసింది కంపెనీ. ఇది 800-వోల్ట్ సిస్టమ్‌కు నిలుస్తుంది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ధర, ఫీచర్స్ వివరాలు తెలుసుకుందాం. ఆడి కొత్త ఎలక్ట్రిక్ కారు రెండు వేరియంట్లలో విడుదల కానుంది. వాటిలో ఒకటి
Updated on: Mar 20, 2024 | 3:32 PM

ఆడి కొత్త ఎలక్ట్రిక్ కారును మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. ఆడి కొత్త ఎట్రాన్ ఎస్‌యూవీని మార్కెట్లో లాంఛ్ చేసింది కంపెనీ. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రీమియం ప్లాట్‌ఫాం ఎలక్ట్రిక్ ఆర్కిటెక్చర్‌పై తయారు చేసింది కంపెనీ. ఇది 800-వోల్ట్ సిస్టమ్‌కు నిలుస్తుంది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ధర, ఫీచర్స్ వివరాలు తెలుసుకుందాం.

ఆడి కొత్త ఎలక్ట్రిక్ కారు రెండు వేరియంట్లలో విడుదల కానుంది. వాటిలో ఒకటి Q6 ఇ-ట్రాన్, మరొకటి SQ6 ఇ-ట్రాన్ మోడల్. ఈ రెండు మోడళ్లు కూడా100 kWh బ్యాటరీ ప్యాక్‌తో రానున్నాయి. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 625 కి.మీల దూరం ప్రయాణించవచ్చు. రెండు మోడళ్ల పవర్ అవుట్‌పుట్ 382 bhp / 483 bhp.

కొత్త Q6 ఇ-ట్రాన్ పొడవు 4771 mm, వెడల్పు 1993 mm, ఎత్తు 1648 mm మరియు వీల్‌బేస్ 2899 mm. ముందు భాగంలో, ఫాక్స్ డిఫ్యూజర్, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్‌లు కారుకు చక్కని రూపాన్ని అందిస్తాయి. కారులో ఎల్‌ఈడీ లైట్ క్లస్టర్, వెనుక భాగంలో ఎల్‌ఈడీ లైట్ బార్ ఉన్నాయి.

ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కారులో 11.9-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 14.5-అంగుళాల టచ్‌స్క్రీన్ ఉన్నాయి. ఇది కాకుండా ఫ్రంట్ ప్యాసింజర్ కోసం ప్రత్యేక 10.9-అంగుళాల డిస్ప్లే అందుబాటులో ఉంది. ఈ కారులో హెడ్-అప్ డిస్‌ప్లే, కనెక్ట్ చేయబడిన టెక్నాలజీ, రీసైకిల్ మెటీరియల్స్‌తో తయారీతో పెద్ద క్యాబిన్, 22-స్పీకర్ ఆడియో సిస్టమ్ ఉన్నాయి.

క్యూ6 ఇ-ట్రాన్ ఎలక్ట్రిక్ కారు స్టాండర్డ్ మోడ్‌లో కేవలం 5.9 సెకన్లలో 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకోగలదని ఆడి పేర్కొంది. SQ6 వేరియంట్ కేవలం 4.2 సెకన్లలో 0-100 కిమీ/గం నుండి వేగాన్ని అందుకోగలదు.




