AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taapsee Pannu: నువ్వు జాగ్రత్త.. అతడు నిన్ను దుబాయ్‏లో అమ్మేస్తాడేమో.. హీరోయిన్ తాప్సీ షాకింగ్ కామెంట్స్..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ మొదటి సారి తన భర్త బ్యాడ్మింటన్ కోచ్ మథియాస్ బో గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. మథియాస్ తనకు తొలిసారి ప్రపోజ్ చేసినప్పుడు అనేక సందేహాలు వచ్చాయని.. అతడితో ఫస్ట్ డేట్ కు వెళ్లినప్పుడు తన స్నేహితులు చాలా కంగారు పెట్టారని అన్నారు.

Taapsee Pannu: నువ్వు జాగ్రత్త.. అతడు నిన్ను దుబాయ్‏లో అమ్మేస్తాడేమో.. హీరోయిన్ తాప్సీ షాకింగ్ కామెంట్స్..
Taapsee
Rajitha Chanti
|

Updated on: Aug 09, 2024 | 5:25 PM

Share

ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన తాప్సీ.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది. హిందీలో వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సరసన డంకీ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న తాప్సీ.. ఇటీవలే తన ప్రియుడితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ మొదటి సారి తన భర్త బ్యాడ్మింటన్ కోచ్ మథియాస్ బో గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. మథియాస్ తనకు తొలిసారి ప్రపోజ్ చేసినప్పుడు అనేక సందేహాలు వచ్చాయని.. అతడితో ఫస్ట్ డేట్ కు వెళ్లినప్పుడు తన స్నేహితులు చాలా కంగారు పెట్టారని అన్నారు.

“11 ఏళ్ల క్రితం మొదటిసారి మేము కలిశాం. ఆ తర్వాత మా మధ్య ప్రేమ చిగురించింది. తక్కువ సమయమే ప్రేమలో ఉన్నాం. తొమ్మిదేళ్లుగా ఒకరి అభిప్రాయాలను మరొకరం గౌరవించుకున్నాం. ఏ విషయంలోనూ రాజీ పడలేదు. జీవితాంతం కలిసి ఉండగలమనే నమ్మకం వచ్చాకే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాం. మథియాస్ డేన్మార్క్ వ్యక్తి. అతడు మొదటిసారి ప్రపోజ్ చేసినప్పుడు చాలా సందేహాలు వచ్చాయి. కొన్నిరోజులకు అతడి ప్రేమ అర్థమయ్యింది. నా భర్తకు డెన్మార్క్, దుబాయ్ మాత్రమే తెలుసు. ఫస్ట్ డేట్ కోసం దుబాయ్ వెళ్దామని అన్నాడు. ఇదే విషయాన్ని నా స్నేహితులతో చెప్పగా లేనిపోని విషయాలు చెప్పి కంగారు పెట్టారు. నువ్వు జాగ్రత్త.. అతడు నిన్ను దుబాయ్ లో ఎవరికైనా అమ్మేస్తాడేమో అని అన్నారు. అలాగే నా ఫ్రెండ్ వాళ్ల అక్క దుబాయ్ లో ఉంటుందని తన నంబర్ నాకు ఇచ్చి అవసరమైతే కాల్ చేయాలని చెప్పారు” అంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం తాప్సీ నటించిన ఫిర్ ఆయీ హసీనా దిల్ రుబా, ఖేల్ ఖేల్ మే చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఖేల్ ఖేల్ మే సినిమా ఆగస్ట్ 15న విడుదల కానుండగా.. ఫిర్ ఆయీ హసీనా దిల్ రుబా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?