Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar: ప్రశాంత్ నీల్ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు.. అంచనాలు పెంచేస్తోన్న శ్రియారెడ్డి కామెంట్స్..

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా.. మలాయళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక వీరే కాకుండా.. పొగరు సినిమా బ్యూటీ శ్రియా రెడ్డి సైతం ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సలార్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించారని అన్నారు.

Salaar: ప్రశాంత్ నీల్ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు.. అంచనాలు పెంచేస్తోన్న శ్రియారెడ్డి కామెంట్స్..
Salaar, Sriya Reddy
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 21, 2023 | 2:45 PM

ఇండియన్ సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తోన్న సినిమా సలార్. కేజీఎఫ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక గతంలో విడుదలైన వర్కింగ్ ఫోటోస్ మాత్రం ఈ మూవీపై మరింత క్యూరియాసిటిని పెంచాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా.. మలాయళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక వీరే కాకుండా.. పొగరు సినిమా బ్యూటీ శ్రియా రెడ్డి సైతం ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సలార్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించారని అన్నారు.

“సలార్ సినిమా కేజీఎఫ్ చిత్రానికి మించి ఉంటుంది. ఇప్పటివరకు ఇలాంటి స్క్రిప్ట్, యాక్షన్ ను చూడలేదు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సినిమాలాగా ప్రశాంత్ నీల్ ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ప్రభాస్ ఇప్పటివరకు చూడని విధంగా ఉంటారు. ఆయన స్క్రీన్ మీద కనిపించగానే ప్రేక్షకులు ఆనందిస్తారు. ఇందులోని ప్రతి సన్నివేశం సరికొత్తగా ఉంటుంది. అలాగే పృథ్వీరాజ్ పాత్ర సైతం వేరే లెవల్లో ఉంటుంది. ఈ సినిమాలో ప్రతి ఒక్కరి పాత్రర అడియన్స్ కు మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది.” అంటూ చెప్పుకొచ్చింది శ్రియారెడ్డి. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ తో ఇప్పుడు ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

ఇదిలా ఉంటే..ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. ఇందుకు సరిగ్గా 100 రోజులు ఉందంటూ చిత్రయూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. ప్రపంచానికి సీపీఆర్ ఇచ్చే సమయం వచ్చేసింది. సెప్టెంబర్ 20న సలార్ కోసం సిద్ధంగా ఉండండి అంటూ చిత్రయూనిట్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.