Sreeleela: ఈ కుందనపు బొమ్మే కావాలంటున్న కుర్ర హీరోలు.. అందాల శ్రీలీలకు ఆఫర్లే ఆఫర్లు.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఆయన శిష్యురాలు గౌరీ తెరకెక్కించిన సినిమా పెళ్లి సందడి. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రూపొందిన ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ శ్రీలీల.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఆయన శిష్యురాలు గౌరీ తెరకెక్కించిన సినిమా పెళ్లి సందడి(Pelli SandaD). శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రూపొందిన ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ శ్రీలీల(Sreeleela). తెలుగులో తొలి సినిమాతోనే ఇక్కడి ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ వయ్యారి భామ. కన్నడలో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ. పెళ్లి సందడి సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ చిన్నదాని అందానికి , చిలిపితనాన్ని ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాంతో ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే మాస్ రాజా రవితేజ సినిమాలో అవకాశం దక్కించుకుంది ఈ అమ్మడు. త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కికుతోన్న ఈ సినిమాకు ధమాకా అనే టైటిల్ ను ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.
అలాగే జాతి రత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. ప్రస్తుతం ఈ యంగ్ హీరో అనగనగా ఒక రాజు సినిమా చేస్తున్నాడు. ఇందులో నవీన్ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.వారాహి బ్యానర్ లో గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు హీరోగా లాంచ్ అవుతున్న సినిమాలో శ్రీ లీలనే హీరోయిన్ గా తీసుకున్నారు. నితిన్ – వక్కంతం వంశీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీలో ఈ బ్యూటీ నటించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలాగే యంగ్ హీరో ఆశిష్ రెండో సినిమా ‘సెల్ఫిష్’ లో శ్రీ లీల హీరోయిన్ గా ఎంపికైనట్లుతెలుస్తుంది. వీటితోపాటు పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తోన్న సినిమాలోనూ శ్రీలీల హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఇటీవలే ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మరో వైపు మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. వీటితోపాటు కన్నడాలోనూ ఈ బ్యూటీ ఆఫర్లు అందుకుంటోంది. ఇలా వరుస ఆఫర్లతో ఈ కుర్ర బ్యూటీ ఫుల్ బిజీగా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి