AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ బెనిఫిట్‌ షోలకు గ్రీన్ సిగ్నల్.. టికెట్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 10న విడుదల కానుంది.

Game Changer: 'గేమ్ ఛేంజర్' బెనిఫిట్‌ షోలకు గ్రీన్ సిగ్నల్.. టికెట్ రేట్లు ఎలా ఉన్నాయంటే?
Game Changer
Basha Shek
|

Updated on: Jan 04, 2025 | 7:34 PM

Share

గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాత్రి ఒంటి గంట బెనిఫిట్ షో టికెట్ ధర 600 రూపాయలుగా నిర్ణయించింది. అలాగే మొదటి రోజు ఆరు షోలకు అనుమతిచ్చింది.ఆ తర్వాత 11 నుంచి 23వ తేదీ వరకు ఐదు షోలు వేసుకోవచ్చని తెలిపింది. జనవరి 10 నుంచి జనవరి 23 వరకు 5 షోస్ కు టిక్కెట్ రేట్లు పెంపున కు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం మల్టీప్లెక్స్ టికెట్ కు అదనంగా 175 రూపాయలు పెంచుకోవచ్చని, సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ కు అదనంగా 135 రూపాయలు పెంచుకోవచ్చు. దీనికి సంబంధించి కాసేపటి క్రితమే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లోనూ ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు. ఇప్పటికే అమెరికాలోని డల్లాస్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇప్పుడు ఏపీలోని రాజమండ్రిలో నూ మరో ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

పొలిటికల్ బ్యాగ్రౌండ్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, టాలీవుడ్ హీరోయిన్ అంజలి, శ్రీకాంత్, ఎస్ జే సూర్య, సముద్రఖని, సునీల్, జయరాం తదితరులు  కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేశాయి. కాగా పుష్ప 2 ఘటన తర్వాత తెలంగాణలో బెనిఫిట్ షోలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ల పెంపుపై ఏపీ ప్రభుత్వం జీవో..

రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!