Chandini Chowdary : ఆయన దీవెనెలు నాకు లక్కీ చార్మ్.. చాందిని చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
చాందిని చౌదరి(Chandini Chowdary ).. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోయిన్ గా మారింది ఈ అమ్మడు. కలర్ ఫోటో సినిమాతో మంచి హిట్ ను అందుకుంది ఈ అమ్మడు.
చాందిని చౌదరి(Chandini Chowdary ).. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోయిన్ గా మారింది ఈ అమ్మడు. కలర్ ఫోటో సినిమాతో మంచి హిట్ ను అందుకుంది ఈ అమ్మడు. ఇప్పుడు సమ్మతమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ జూన్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తుంది. ఈసందర్భంగా హీరోయిన్ చాందిని మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
చాందిని చౌదరి మాట్లాడుతూ.. అల్లు అరవింద్ గారి దీవెనలు నాకు లక్కీ చార్మ్ లా అనిపిస్తుంది. కలర్ ఫోటో తర్వాత మరిన్ని మంచి కథలు చేయాలని భావించిన సమయంలో ఎంపిక చేసుకున్న మరో అద్భుతమైన కథ సమ్మతమే. ఒక మంచి పాత్రని ఇచ్చిన గోపీనాథ్ గారికి థాంక్స్. కిరణ్ తో పని చేయడం ఆనందంగా అనిపించింది. శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ కి ఫ్యాన్ నేను. ఈ చిత్రం కోసం అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. సమ్మతమే గీతా ఆర్ట్స్ లో విడుదల కావడం మాటల్లో చెప్పలేని ఆనందం ఇస్తుంది. ఇలాంటి గొప్ప అవకాశం వచ్చినందుకు సంతోషంగా వుంది. మా నిర్మాత ప్రవీణ గారు ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డీవోపీ సతీష్ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. మిగతా టెక్నికల్ టీం అంతటికి థాంక్స్. ఈ చిత్రాన్ని 24న థియేటర్ లో చూసి సమ్మతమే అనాలని కోరుకుంటున్నాను. ప్రతి అమ్మాయి చూడాల్సిన సినిమా ఇది. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులు తప్పకుండ నచ్చే సినిమా సమ్మతమే” అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి