Snigdha: అందుకే పెళ్లి చేసుకోవడం లేదు.. అసలు విషయం చెప్పిన నటి స్నిగ్ధ
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అలా మొదలైంది సినిమాలో నాని ఫ్రెండ్ గా నటించింది స్నిగ్ద. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంది. చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన స్నిగ్ద. ఇప్పుడు సినిమాలు తగ్గించింది. ఒక ప్రోగ్రాం లో దర్శకురాలు నందిని రెడ్డి స్నిగ్ద ను చూసి తన సినిమాలో కీలక పాత్రలోకి తీసుకున్నారు.
స్నిగ్ద.. చిన్నది టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే.. స్నిగ్ద అని చెప్తే గుర్తుపట్టకపోవచ్చు కానీ ఆమెను చుస్తే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అలా మొదలైంది సినిమాలో నాని ఫ్రెండ్ గా నటించింది స్నిగ్ద. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంది. చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన స్నిగ్ద. ఇప్పుడు సినిమాలు తగ్గించింది. ఒక ప్రోగ్రాం లో దర్శకురాలు నందిని రెడ్డి స్నిగ్ద ను చూసి తన సినిమాలో కీలక పాత్రలోకి తీసుకున్నారు. అలా అలా మొదలైంది సినిమాలో నటించింది. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు.. స్నిగ్ద కు మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చాయి. తన కామెడీ టైమింగ్ తో చాలా సినిమాల్లో మెప్పించింది స్నిగ్ద.
చూడటానికి అచ్చం అబ్బాయిలా ఉండే ఈ నటి పెళ్లి కి మాత్రం నో అంటుంది. తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనే లేదు అంటుంది స్నిగ్ద. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లోనూ ఆమె టామ్ బాయ్ అనే చెప్పాలి. ఏదైనా సరే డేర్ అండ్ డాషింగ్ గా చేస్తూ ఉంటారు. అయితే ఆమె పెళ్లి చేసుకోను అని చెప్పడం వెనక ఓ రీజన్ కూడా ఉంది. స్నిగ్ద పరమశివుడి భక్తురాలు. ఆమె ఎక్కువ ఆధ్యాత్మిక సేవలోనే గడుపుతుంది. ప్రతి ఏడాది శివమల ధరిస్తుంది. ఈ విషయాన్ని ఆమె గతంలో పలు సందర్భాల్లో తెలిపారు.
స్నిగ్ద వయసు ప్రస్తుతం 43 ఏళ్లు.. ఇంత ఏజ్ వచ్చినా ఆమె పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు. అయితే తన పెళ్లి గురించి గతంలో స్నిగ్ద మాట్లాడిన ఓ వీయుడై ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తనకు వివాహ బంధం మీద నమ్మకం లేదు అని అంటుంది ఈ నటి. ఇప్పటివరకు పెళ్లి గురించి ఆలోచించలేదు. నా జీవితంలో ఆ సందర్భం కూడా రాలేదు. ప్రస్తుతం నేను దీక్షలో ఉన్నాను. ఏడాదిలో 120 రోజులు దీక్షలోనే ఉంటాను. పెళ్లి చేసుకొని సంసారం అనే బంధంలోకి వెళ్లడం నాకు ఇష్టం లేదు. పెళ్లి చేసుకుంటే నేను మరొకరి ఆధీనంలోకి వెళ్ళిపోతాను అది నాకు ఇష్టం లేదు అని తెలిపింది స్నిగ్ద.
స్నిగ్ద ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
స్నిగ్ద ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.