Coolie: రజినీకాంత్ సినిమాలో కమల్ హాసన్ కూతురు.. లుక్ అదిరిపోయిందిగా
అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, తుషార విజయన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది. అక్టోబర్ 10న వేటయన్ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
రజనీకాంత్ నటిస్తున్న 170వ చిత్రం వేటయన్. ఈ చిత్రానికి జైబీమ్ ఫేమ్ టి.ఎస్.జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. జైలర్ తర్వాత మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, తుషార విజయన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది. అక్టోబర్ 10న వేటయన్ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా లైనప్ చేశారు సూపర్ స్టార్.
ఇది కూడా చదవండి : Bigg Boss Telugu 8: ఎంతమందిని దింపుతార్రా బాబు..! బిగ్ బాస్ హౌస్‌లోకి మరో క్రేజీ బ్యూటీ
రజనీకాంత్ తన 171వ చిత్రానికి అట్టహాసంగా శ్రీకారం చుట్టారు. రజనీకాంత్ నటించిన ఈ చిత్రానికి దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కూలీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. గతంలో ఈ సినిమా పోస్టర్, టైటిల్ టీజర్ విడుదలై అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దాంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇది కూడా చదవండి : Prasad Behara : అన్నం తింటుంటే బూతులు తిట్టి గెంటేశారు.. ప్రసాద్ బెహరా మాటలకు కన్నీళ్లు ఆగవు
దళపతి విజయ్‌తో ‘మాస్టర్’, ‘లియో’ వంటి రెండు హిట్ చిత్రాలను, కమల్ హాసన్‌కి బ్లాక్‌బస్టర్ హిట్ ‘విక్రమ్’ని అందించిన లోకేష్ కనగరాజ్, సూపర్ స్టార్ రజనీకాంత్‌తో తొలిసారిగా సినిమా చేస్తుండటంతో ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ఈ చిత్రంలో నటిస్తున్న నటీనటుల లుక్‌తో పోస్టర్స్‌ను చిత్రబృందం 28వ తేదీ నుంచి విడుదల చేస్తోంది. ముందుగా మలయాళ నటుడు చౌబిన్ షకీర్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మంజుమ్మల్ బాయ్స్‌లో నటించి తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సూపర్‌స్టార్ నాగార్జున పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. తాజాగా నటి శ్రుతిహాసన్ డెబ్యూ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ప్రీతీ పాత్రలో శ్రుతిహాసన్ నటిస్తుందని ప్రకటించారు. ఈ సినిమాలో శ్రుతిహాసన్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.