Prasad Behara : అన్నం తింటుంటే బూతులు తిట్టి గెంటేశారు.. ప్రసాద్ బెహరా మాటలకు కన్నీళ్లు ఆగవు
యూట్యూబ్‌లో చాలా ఫెమస్ ఇతను. చాలా షార్ట్ ఫిలిమ్స్‌లో నటించాడు. ముఖ్యంగా కామెడీ ప్రధానంగా షార్ట్ ఫిలిమ్స్‌ను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తన కామెడీ పంచ్ లతో ప్రేక్షకులను నవ్విస్తున్నారు ప్రసాద్ బెహరా.. ఇప్పటికే చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన ప్రసాద్ బెహరా ఇప్పుడు సినిమాల్లోకి వచ్చేశాడు.
ప్రసాద్ బెహరా.. తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా సోషల్ మీడియా వాడే వాళ్లకు ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్‌లో చాలా ఫెమస్ ఇతను. చాలా షార్ట్ ఫిలిమ్స్‌లో నటించాడు. ముఖ్యంగా కామెడీ ప్రధానంగా షార్ట్ ఫిలిమ్స్‌ను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తన కామెడీ పంచ్ లతో ప్రేక్షకులను నవ్విస్తున్నారు ప్రసాద్ బెహరా.. ఇప్పటికే చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన ప్రసాద్ బెహరా ఇప్పుడు సినిమాల్లోకి వచ్చేశాడు. మెగా డాటర్ నిహారిక నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాలో నటించాడు ప్రసాద్ బెహరా. ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సాధించింది. అలాగే ప్రసాద్ బెహరా తన నటనతో ఆకట్టుకున్నాడు.
ఇది కూడా చదవండి : పెళ్లైన ముగ్గురితో ఎఫైర్స్.. వారిలో క్రికెటర్ కూడా.. ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే
ఇదిలా ఉంటే తనకు ఓ బడా సినిమాలో ఛాన్స్ వచ్చినా కూడా తనను సినిమాలో నుంచి తీసేశారని చెప్పి ఎమోషనల్ అయ్యాడు ప్రసాద్ బెహరా. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రసాద్ బెహరా మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో తనకు ఎదురైన అవమానాల గురించి తెలిపాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రసాద్ బెహరా మాట్లాడుతూ తనకు ఇండస్ట్రీలో ఓ చేదు అనుభవం ఎదురైందని తెలిపాడు. గీత అనే సినిమాలోతనకు ఓ పాత్ర వచ్చిందని తెలిపాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలో మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఇచ్చాక మూవీ టీమ్ తో కలిసి భోజనం చేస్తుంటే.. ప్రొడక్షన్ బాయ్ వచ్చి తనను తోసేశాడు అని తెలిపాడు ప్రసాద్.
ఇది కూడా చదవండి : తస్సాదియ్యా..! మేం వయసుకు వచ్చాం హీరోయిన్ను చూశారా.? మెంటలెక్కించిందిగా.!
అన్నం తింటున్న తనను బండబూతులు తిడుతూ.. ఇక్కడ అన్నం తింటావా అని తనను గెంటేశాడని.. దాంతో అక్కడి నుంచి వెళ్లి వేరే వాళ్ళ దగ్గర కూర్చొని తిన్నాను అని చెప్పాడు. ఆ సినిమాలో నేను ఓ చిన్న పాత్ర చేశాను. నా గెటప్ చూసి అతను నన్ను అన్నం తింటుంటే గెంటేశాడు. ఆ తర్వాత రోజు నేను సీన్ చేసి వచ్చిన తర్వాత మళ్లీ అన్నం తింటుంటే అతను నా దగ్గరకు వచ్చి సారీ చెప్పాడు. మీరు యాక్టర్ కాదు అనుకున్నాను నన్ను క్షమించండి అన్నాడని ప్రసాద్ తెలిపాడు. కానీ ఆ ప్రొడక్షన్ బాయ్ చాలా దారుణంగా అవమానించాడు అని ఎమోషనల్ అయ్యాడు ప్రసాద్. అలాగే తర్వాత ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో తనకు ఛాన్స్ వచ్చిందని తెలిపాడు. అయితే ఒకసారి ప్రొడక్షన్ ఆఫీస్ కు వెళ్తే.. నన్ను ఓకే చేసి అడ్వాన్స్ తీసుకోవడానికి కూడా రమ్మన్నారు. అంతా ఒకే అయిన తర్వాత సరే ఓకే నాయుడుగారు అని అన్నారు. నేను కాదండీ అన్నాను, అలాగే రెడ్డిగారు అన్నారు .. కాదు అన్నాను, ఓకే చౌదరిగారు అన్నారు.. నేను కాదు అన్నాను, దాంతో అతనికి మ్యాటర్ అర్ధమైంది. దాంతో సరే రేపు రండి అడ్వాన్స్ ఇస్తాం అని చెప్పారు. కానీ ఆ తర్వాత ఆ ప్రొడక్షన్ నుంచి నాకు కాల్ రాలేదు అని చెప్పాడు. ఇండస్ట్రీలో ఇప్పటికి క్యాస్ట్ ఫీలింగ్ ఉంది అని ప్రసాద్ అన్నాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.